Samantha: సినీ నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలను అలాగే వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా నాగచైతన్యతో కలిసి నటించిన ఈమె ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో పడిన వీరిద్దరూ కొంతకాలం పాటు రహస్య ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఇలా వీరి పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకు అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత మయోసైటిసిస్ వ్యాధికి కూడా గురి అయ్యారు. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడిన ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
నావల్ల కాలేదు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సమంత మాట్లాడుతూ తాను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను అయితే ప్రతి ఒక్కరూ కూడా రోజంతా కలిపి నాతో మూడు నాలుగు సన్నివేశాలు మాత్రమే షూటింగ్ చేసేవారు. కానీ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో చేసిన సిరీస్ లో మాత్రం వారు ఒక గంటలోనే ఆ షూటింగ్స్ అన్ని పూర్తి చేసేవారు. వారితో సినిమా చేయలేక నేను నా మేనేజర్ కి ఫోన్ చేసి నావల్ల కాలేదంటూ బాగా ఏడ్చేశాను. అయితే క్రమక్రమంగా వారితో పని చేయడం నాకు అలవాటుగా మారిపోయింది అంటూ ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే గురించి సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































