నేను వారిద్దరి వల్లే ఇంకా బ్రతికున్నాను అంటున్న సామ్… వాళ్లెవరంటే ?
‘Samantha:ఏం మాయ చేశావే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ” సమంత ” అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవల పలు కారణాల రీత్యా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. తన విడాకుల ప్రకటన అనంతరం తొలినాళ్లలో హరిద్వార్, రుషికేష్ లాంటి ప్రాంతాల్లో పర్యటించింది. మెడిటేషన్ లాంటి వాటిని ప్రాక్టిస్ చేస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకొనే పనిలో పడింది.
నేను వారిద్దరి వల్లే ఇంకా బ్రతికున్నాను అంటున్న సామ్… వాళ్లెవరంటే ?
ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది సమంత. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సామ్. మరోవైపు హీరోయిన్ గా ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్… త్వరలోనే యశోద మూవీ సెట్ లో అడుగపెట్టనుంది. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతోందీ ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమా షూటింగ్ ల నుంచి ఏ మాత్రం తీరిక దొరికినా విహారయాత్రలకు చెక్కేస్తోంది సామ్.
ఇందులో భాగంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తోంది సమంత. ఈ మేరకు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ లో నాలుగో రోజు మ్యాజిక్ జరిగిపోయింది. ‘ వీరిద్దరి వల్లే నేను ఇంకా బతికున్నాను ’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి #skiingisbelieving అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. ‘స్కీయింగ్ అనేది సాహసోపేతమైన క్రీడ. ఏదైనా అనుకోకుండా జరిగితే ప్రాణాలు కూడా పోతాయి. అయినా సరే నేను విజయవంతంగా స్కీయింగ్ టార్గెట్ పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం వీరిద్దరే’ అంటూ మరో వీడియోలో చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…