టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం పుష్ప. ఇందులో అల్లు అర్జున్ రష్మిక మందన నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 17 న థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

డిసెంబర్ 10న ఈ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా పుష్ప టీమ్ ప్రకటించింది.ఇటీవలే సమంత లంగా జాకెట్ ధరించి మాస్ లుక్ లో బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఫోటోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంతకు సంబంధించి ఫుల్ ఫోటోని కూడా విడుదల చేశారు. అలాగే ఈ స్పెషల్ సాంగ్ కోసం దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని చిత్రబృందం తెలిపారు.
అలాగే ఈ స్పెషల్ సాంగ్ లో సమంత బన్నీతో కలిసి స్టెప్పులు ఇరగదీసిందని తెలుస్తోంది. కేవలం అయిదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత దాదాపుగా కోటి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సమంతా కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఐటమ్ సాంగ్ కూడా చేయలేదు.
This winter is going to get heated up with @Samanthaprabhu2's moves ????????
— Pushpa (@PushpaMovie) December 8, 2021
'Sizzling Song of The Year' on 10th DEC ????????#PushpaTheRise#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/KL0d6L10ya
కానీ మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ కోసం సమంత ఈ సాంగ్ లో స్టెప్పులు వేయడంతో, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా మారింది.ఇదిలా ఉంటే పుష్ప సినిమా నుంచి రిలీజైన పాటలకు, టీజర్ లకు,పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పాటలు ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.





























