Samantha: సమంత, నాగచైతన్య వారి నాలుగేళ్ళ వైవహిక జీవితానికి స్వస్తి చెప్పి అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. కారణం ఏమిటో తెలియదు కానీ ప్రస్తుతం వారి వారి కెరీర్లో చాలా బిజీగా గడుపుతున్నారు. నాగ చైతన్య వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇక ఇటు సమంత పుష్ప ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకొని అటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది.

అయితే కాస్త విరామం దొరికితే ట్రిప్పులకి చెక్కెస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూనే ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. షూటింగ్ లలోనే కాకుండా తన సమయాన్ని తన పెంపుడు జంతువులతో గడపడానికి ఇష్టపడుతోంది సమంత. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే ఈ అమ్మడు తాజాగా తన పెంపుడు జంతువులతో తన అనుబంధాన్ని తెలియజేస్తూ వాటితో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది.
సమంత అలానే ఒంటరిగా చనిపోవాలి….
I would consider myself lucky ☺️ https://t.co/QH5XEtfALK
— Samantha (@Samanthaprabhu2) May 27, 2022
He deleted and ran away ????
— SARAVAN (@Saravan_2255) May 27, 2022
This was the tweet ???? pic.twitter.com/H7YZAPmVVC
సమంత తాజాగా తన పెంపుడు కుక్కతో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. అందుకు ఒక నెటిజెన్ “సమంత పిల్లులు మరియు కుక్కలతోనే ఒంటరిగా చనిపోవాలి” అని కామెంట్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన సమంత…. “అలా జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలుగా భావిస్తాను” అని సమాధానం ఇచ్చింది.



































