Samantha : ఏ హీరోయిన్ కి ఐనా పెళ్లి తరువాత కెరీర్ లో జోరు తగ్గుతుంది. దక్షిణాది హీరోయిన్స్ విషయంలో అది ఇంకా ఉంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మార్పు వస్తున్నా ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ ను గ్లామర్ పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అయితే బాలీవుడ్ లో ఇవేవి పట్టించుకోరు, అక్కడ హీరోయిన్లు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా హీరోయిన్లుగా అది కూడా గ్లామర్ పాత్రల్లో రానిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన సమంత మాత్రం డిఫరెంట్ గా ఉంది. పెళ్లి అయ్యాక కథ పరంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసిన సమంత వైవాహిక జీవితంలో ఇమడ లేక భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకుంది. ఇద్దరూ విడిపోవడానికి కారణాలను వివరించకపోయినా విడాకుల తరువాత ఇద్దరూ సినిమాల్లో మళ్ళీ బిజీ అయ్యారు.

ఎన్టీఆర్ కి నో చెప్పిన సమంత…
ఇక విడాకుల తరువాత సమంత కెరీర్ ఇక నెమ్మదిస్తుంది అని అందరూ అనుకున్నా అమ్మడు మాత్రం రెట్టింపు జోరు తో ముందుకు వెళ్తోంది. ఇటు సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇక ఏకంగా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక వైపు పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర తో బిజీగా ఉన్న సామ్ అటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలకు కమిట్ అయింది.

ఇదే తరుణంలో ఎన్టీఆర్ కొరటాల క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అవకాశం వస్తే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పిందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ నెటిజన్స్ కూడా సమంత ఇది మరీ టూ మచ్, ఎన్టీఆర్ సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరీ అంత బిజీ గా ఉన్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తోంది. ఇంతకుముందు ఎన్టీఆర్, సమంత కలిసి కొరటాల కాంబినేషన్ లోనే జనతాగారేజ్ సినిమాలో నటించారు.



























