Samantha : నిత్యం ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే హీరోయిన్స్ లో సమంత ముందుంటుంది. నాగచైతన్య సమంత విడాకుల తరువాత సమంత గురించి ఏ చిన్న వార్తయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ట్రోల్స్ గురించి చెప్పక్కర్లేదు. విడాకుల తరువాత సామ్ ఏ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ లో మాట్లాడినా తనపై పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తాయో అలానే నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి వాటిని సమంత పెద్దగా పట్టించుకోదు.

సమంత మొహం ఎలా అయిందేంటి…
పాన్ ఇండియా ప్రాజెక్టులు, అటు బాలీవుడ్ ఎంట్రీ తో బిజీగా ఉన్న సమంత కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైంది అసలు బయట కనిపించడం లేదు. ఫోటో షూట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ఉండే సమంత కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. ఇక దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధిచిన వార్తలు షికార్లు చేసాయి. సమంత కు ఆరోగ్యం బాగోలేదని, చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది అంటూ కథనాలు అల్లేశారు. అయితే తాజాగా సమంత బయట కనిపించి మీడియా కంట పడింది.

అయితే మొహం చాలా మారిపోయి గుర్తుపట్టలేనంతగా తయారైంది. దీంతో సామ్ కి ఏమైంది అంటూ నెటిజన్స్ ప్రశ్నలు కురిపిస్తున్నారు. నిజంగా చర్మ సంబంధ వ్యాధులతో సమంత బాధపడుతోందా అంటూ కొందరు అంటుంటే, సమంత సర్జరీ చేయించుకుంది అందుకే ఇలా అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది సమంత గర్భసంచి తీయించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని వేద పాఠశాల ఆవరణలో ప్రత్యేక పూజలు చేయించుకుంది సమంత. ఈ సమయంలో సమంతను చూసి పేషెంట్ లా ఉంది అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

































