పాలిటిక్స్ ఇప్పటివరకు మనం పార్టీల మధ్య రాజకీయాలు చూసాం..సినిమాల్లో కూడా పాలిటిక్స్ తక్కువేం కాదనుకోండి. ఇపుడు అవే పాలిటిక్స్ బుల్లితెర మీద కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో టీవీ షోస్ చాలా ఎక్కువగా పెరగడం తో యాంకర్ లలో పోటీ బాగా పెరగడం జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త యాంకర్స్ వస్తూనే ఉన్నారు. యాంకరింగ్ కి సొగసు చేర్చి తమదైన శైలిలో నడుస్తున్న అనసూయ, రేష్మి జబర్దస్త్ షోలో అందాలను ఆరబోస్తూ షోనీ ముందుకు నడిపిస్తున్నారు. జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది అనసూయ, రేష్మి నే. ఈ భామలు ఇప్పుడు యాంకరింగ్ తో పాటు అప్పుడపపుడు స్కిట్ లలో కూడా నటిస్తు వస్తున్నారు.

నవ్వుల రారాజు నాగబాబు ఇంకా కొంత మంది కమిడియన్ లు జబర్దస్త్ షో నుండి విడిపోయి అదిరింది షో చేయడం జరిగింది. ఇందులో కొత్తగా టీవీ నటి సమీరా యాంకరింగ్ చేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా పండగలు లేదా స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు రెండు జట్లు గా వీడి పోయి మేమంటే మేము అని పోటీ పడేవారు. కానీ ఇపుడు పరిస్తితి అలా లేదు. అనసూయ, రేష్మి లు స్కిట్ లలో సమీరా మీద డైలాగ్ లు కావాలని రాయించి మరి చేస్తున్నారట.

ఈ విషయం గురించి సమీరా స్పందించడం జరిగింది. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నటించాలని ఎపుడు అనుకోలేదు కానీ అనుకోకుండా ఒక టీవీ సీరియల్ ఒప్పుకోవడం జరిగింది. దానితో ఇక్కడే ఇలా ఉండిపోతాను అనుకోలేదు. అలా సీరియల్స్ చేస్తున్న నాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం అదిరింది షో ద్వారా వచ్చింది. యాంకరింగ్ అంటే ఎక్కువ మాట్లాడాలి నేను అల మాట్లాడగలనా అని మొదట సందేహపడ్డాను ఎందుకంటే నేను నటిస్తున్న సీరియల్స్ లో క్యారెక్టర్స్ అలాంటివి..కానీ అందరి ప్రోత్సాహంతో చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది

అంతే కాకుండా జబర్దస్త్ షోలో మీ మీద వస్తున్న పంచ్ లకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా, నేను చేస్తున్న వృత్తిలో అన్నింటినీ సరదాగా తీసుకోవాలి, నా మీద ఎవరు ఎన్ని పంచ్ లు వేసిన నేను వాటిని ఫన్నీగా తీసుకొని ఎంజాయ్ చేస్తాను. అంతే కాకుండా వచ్చిన వెంటనే ఎవరు తోపులు కాదని ఎదుగుతున్న కొద్ది మెరుగు పడతారు. అలాగే నాలో కూడా ఫస్ట్ ఎపిసోడ్ కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని చెప్తుంది ఈ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here