Sampoornesh Babu : నేను తీసేది చెత్త సినిమా.. దానికో చెత్త హీరో కావాలి అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని డైరెక్టర్ చెప్పడంతో.. : సంపూర్ణేష్ బాబు.

0
879

Sampoornesh Babu : పేదరికంలో జన్మించిన సంపూర్ణేష్ బాబు పదో తరగతి పూర్తయిన తర్వాత బ్రతకడానికి ఏదైనా పని నేర్చుకోవాలనుకున్నాడు. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబం సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు. సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చేవాళ్ళు.

సంపూర్ణేష్ బాబుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. అలా సంపూర్ణేష్ బాబు ఒకసారి హైదరాబాద్ లో ఓ సినిమా నటుడిని కలిశాడు. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చింది. అలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. తర్వాత హైదరాబాద్ లో మరో సంస్థలో నటనలో శిక్షణలో చేరాడు. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు.వాటిలో భాగంగా స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడింది. సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని స్టీఫెన్ శంకర్ సంపూర్ణేష్ బాబును కలిశాడు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

ఆ సినిమా విశేషాల గురించి సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. సినిమాలంటే నాకు చాలా పిచ్చి.. ఎప్పటికైనా వెండితెరపై కనిపించాలన్నది నా ఆశ అందుకోసం ఎలాంటి ప్రయత్నం అయినా చేయాలనుకున్నాను. సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వచ్చినా చేయాలనుకునే వాన్ని.. అలా స్టీఫెన్ శంకర్ తో పరిచయం ఏర్పడింది. ఆయన ఓ చిన్న బడ్జెట్లో సినిమా తీయాలనుకున్నారు. ఓ కథ రాసుకొని హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన నేనొక సందర్భంలో కలిసినప్పుడు.. నేను తీయబోయే సినిమాలో నువ్వే హీరో అన్నాడు. హీరో అనగానే నేను అవాక్కయ్యాను. చాలాసేపు నేను నమ్మలేకపోయాను. తర్వాత ఆ ఆలోచనల నుంచి తేరుకొని.. మీరు తీయబోయే సినిమాలో నన్నే హీరోగా ఎందుకు? ఎంచుకున్నారని అడిగాను.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

అప్పుడు స్టీఫెన్ రవి శంకర్ నా దగ్గర ఒక చెత్త కథ ఉంది. ఆ సినిమాకు ఆ చెత్త హీరో కావాలి. అందుకే మిమ్మల్ని హీరోగా చేయమని అడుగుతున్నానని అన్నారు. అందరూ హీరోను స్లిమ్ కావాలని చెప్తారు కానీ ఆయన నన్ను వీలైతే ఇంకా లావు కమ్మని చెప్పారు. అందుకు నేను ఏమాత్రం ఫీల్ కాలేదు. ప్యాట్నీ సెంటర్లో ప్యాంటు షర్టు విప్పేయమన్న విప్పేస్తా.. షూట్ చేసుకోమని చెప్పాను.ఎందుకంటే నేను హీరోగా నటించిన సినిమా విడుదల కావాలి.ఆ సినిమాను క్యాసెట్ వేసుకొని టీవీలో చూడొచ్చని ఆలోచించాను. తప్ప నేను ఏమాత్రం బాధపడలేదని సంపూర్ణేష్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 50 లక్షలతో నిర్మించిన హృదయ కాలేయం సినిమా 1కోటి 50 లక్షలు వసూళ్లను సంపాదించి పెట్టింది. సెటైరికల్ పేరడీగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు.