Sandhya Janak : ‘హ్యాపీడేస్’ సినిమాలో తమన్నా తల్లి పాత్రలో మెరిసిన సంధ్య జనక్ పుట్టింది పిఠాపురం. తెలుగు వారే అయినా తండ్రి రైల్వే ఉద్యోగి అవ్వడం వల్ల నార్త్ లో చదువు కొనసాగించారు సంధ్య జనక్. కలకత్తా లో చదివిన సంధ్య జనక్ చిన్న వయసులోనే స్టేజి నాటకాలు రాస్తూ నటిస్తూ ఉండేవారట. ఆ ఆసక్తి సినిమాల్లోకి వచ్చేలా చేసిందంటూ చెప్తారు. ఇక అనసూయ, మర్యాదరామన్న, వేదం, శ్రీరామరాజ్యం, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, అనామిక… ఇలా విజయవంతమైన సినిమాలన్నింట్లో ఆమె కనిపించారు. అందంగా, హుందాగా హీరో, హీరోయిన్లకు తల్లిగా అనేక పాత్రల్ని పోషించిన సంధ్యా జనక్ ఏడేళ్ల సినిమా కెరీర్ లో యాభై కి పైగా సినిమాల్లో నటించారు.

మహేష్ సినిమాలో నటించిన సినిమా చూస్తే షాక్ అయ్యాను…
సినిమాల్లో కొన్ని సార్లు చేసిన ఎడిటింగ్ లో ఆ సీన్ లు పోతుంటాయి, సహాయక పాత్రలు చేసే వాళ్లకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది. మంచి పాత్రలు వచ్చినపుడు చేస్తే గుర్తింపు రావడానికి కూడా అదృష్టం కలిసిరవాలి అంటూ చెప్పారు. ఇక కొన్ని సినిమాల్లో నటించినా, డబ్బింగ్ కూడా చెప్పి వచ్చిన సినిమా విడుదల అయ్యాక అసలు పాత్ర లేని సందర్భాలు చాలానే ఉంటాయంటూ చెప్పారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో నటించానని సంధ్య జనక్ చెప్పారు.

సినిమా షూటింగ్ కోసం లక్నో లో షూటింగ్ మహేష్ బాబు తో సీన్ రెండు మూడు సార్లు రీ టేక్ కూడా చేయించారట. డబ్బింగ్ పనులు కూడా పూర్తయి తీరా సినిమా చూసాక అసలు ఆ పాత్ర కనిపించక పోయే సరికి షాక్ అయిపోయాను అంటూ చెప్పారు. ఇక ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాల్లో నటించినా ఆ సీన్స్ కూడా డిలీట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు అంటే చాలా ఇష్టమంటూ చెప్పిన సంధ్య ప్రభాస్ చాలా డౌన్ టూ ఎర్త్ అంటూ చెప్పింది.
































