Sangeetha : అచ్చమైన తెలుగు అమ్మాయిలా, ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో మొదటి సినిమా తోనే అందరినీ ఆకట్టుకుంది సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో తెలుగులో పరిచయం అయిన సంగీత పెళ్ళాం ఊరెలితే, విజయేంద్ర వర్మ, ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు వంటి సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. కొన్ని సినిమాలలో నటించడం, పరాజయాల కారణంగా ఫేడ్ అవుట్ అయిపొయింది. తరువాత సింగర్ క్రిష్ ను పెళ్లి చేసుకొని తన సమయాన్ని కుటుంబంతో గడుపుతోంది. అయితే సరిలేరు మీకెవ్వరు, ఆచార్య సినిమాలతో మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో సంగీత జీవితంలో జరిగిన ఒక ఘటన ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

తన తల్లి కారణంగా వివాదాలలో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లిన సంగీత…
గతంలో సంగీత ఒక వివాదం లో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం తన తల్లి అవ్వడం విశేషం. కారణం ఏంటంటే.. సంగీత తన తల్లి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఒకే ఇంట్లో సంగీత తన భర్తతో పై అంతస్థులో నివాసం ఉంటే.. పెద్ద కుమారుడితో కలిసి ఆమె తల్లి కింద అంతస్థులో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సంగీత ఇల్లు కాళీ చేసి వెళ్లిపోవాలని వేధిస్తోందని తన తల్లి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ విషయంపై సంగీత అభిమానులకు ట్విట్టర్ ద్వారా వివరణ కూడా ఇచ్చింది. చిన్నపటి నుండి తనను తన తల్లి డబ్బులు సంపాదించే వస్తువుని చుసినట్టుగా చూసేదని, సోదరులు ఇద్దరూ ఏం పని చేయకపోగా మత్తుకు బానిసలుగా మారినా తాను వారినే సమర్టించేదని చెప్పుకొచ్చింది. నేను భర్తతో కలసి సంతోషంగా ఉండటం ఓర్చుకోలేక ఇలా తప్పుడు కేసులు పెట్టి పరువుతీస్తోందని వివరణ ఇచ్చింది. అంతేగాక ఒక తల్లి ఎలా ఉండకూడదో తనని చూసి నేర్చుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో సంగీత ఫ్యామిలీ లోని ఈ వివాదం, సంగీత చేసిన కామెంట్స్ సంచలనం రేపింది.































