Sanghavi : 90 దశకంలో టాప్ హీరోయిన్ గా వెలిగిన తారాల్లో సంఘవి ఒకరు. అప్పట్లో తెలుగు, తమిళం, కన్నడ అంటూ అన్ని భాషలలోనూ నటించింది. సంఘవి పుట్టింది కర్ణాటక మైసూర్ లో. సంఘవి అలనాటి తమిళ తార ఆరతి మనవరాలు, ఆవిడ వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. మొదటి సినిమా అజిత్ సరసన చేసినా, హీరో విజయ్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేసి హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక తెలుగులో ఒక వెలుగు వెలిగింది సంఘవి. అందరూ అగ్ర హీరోలతో నటించింది.

షూటింగ్ లో పక్కకు పిలిచి క్లాస్…
రసిగన్, కోయంబత్తూర్ మాపిలై, విష్ణు, నిలవేవా వంటి సినిమాలలో సంఘవి, విజయ్ కలిసి నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సంఘవి విజయ్ తో విష్ణు సినిమా చేసిన సమయంలో ఒక సాంగ్ షూటింగ్ కోసం నీళ్ళల్లో దిగి డాన్స్ చేయాలి, సంఘవి షాట్ ఒకే అని చెప్పడంతో నీళ్లలో దిగి రెడీ గా ఉంది కానీ విజయ్ మాత్రం నీళ్ళల్లో దిగే ధైర్యం చేయలేదు. ఆ సినిమాకు విజయ్ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ డైరెక్టర్. ఇక విజయ్ ఎంతకి నీళ్ళల్లో దిగకపోవడంతో విజయ్ ని తిట్టాడట. ఆడపిల్ల ధైర్యంగా నీళ్ళల్లో దిగింది నీకేంటి అని అరిచేసరికి దిగాడట.

షూటింగ్ తరువాత నీ వల్లే మా నాన్న నన్ను అరిచాడు అంటూ పక్కకు పిలిచి సంఘవికి క్లాస్ పీకాడట. ఇక సంఘవి తన 10 ఏళ్ల కెరీర్ లో చేసిన సినిమాలు 95 అయితే అందులో 45 తెలుగు సినిమాలే. మిగిలినవి తమిళం, కన్నడ సినిమాలు. ఇక తెలుగులో మొదటి సినిమా సింధూరం. ఈ సినిమాకు సంఘవికి నంది అవార్డు వచ్చింది. ఇక శివయ్య సినిమా దర్శకుడు సురేష్ వర్మ తో ప్రేమ పెళ్లి చేసుకున్న సంఘవి కొన్నాళ్లకు విడాకులు తీసుకుంది. ఇక ఆ తరువాత బెంగళూరు కి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలు చేస్తూ అలాగే బుల్లితెర మీద కనిపిస్తూ సందడి చేస్తోంది.

































