Sara Arjun : మణిరత్నం డైరెక్షన్ లో తన కలల ప్రాజెక్ట్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30 న విడుదల అయింది. కల్కి కృష్ణమూర్తి రచన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం 155 రోజుల్లో మణిరత్నం పూర్తి చేయడం విశేషం. ఇక సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్ వంటి వారు నటించారు. ఇక అచ్చంగా ఆరవ కథగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా తమిళంతో పాటు అన్నిభాషల్లోనూ విడుదల అయి మంచి స్పందన తెచ్చుకుంది.

అపుడు కూతురు ఇపుడు ప్రేయసి…
ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమాలో అందరి నటన ప్రశంసనీయమే. ఇక విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఆయన గొప్ప నటుడుని ఎపుడో నిరూపించుకున్నారు. ఇక పొన్నియిన్ సెల్వన్ లో ఆయన అద్భుతమైన నటన అందించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. ఇక ఆయనను ఇష్టపడే అమ్మాయి యుక్తవయసులో నందిని పాత్రలో సారా అర్జున్ నటించారు. ఎందుకు ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పుకోవాలంటే ఆమె ఇంతకు ముందు విక్రమ్ గారితో నటించింది.

చియాన్ విక్రమ్ మానసికంగా ఎదగని వ్యక్తి ఒక పాపను పెంచే తండ్రిగా ‘నాన్న’ సినిమాలో నటించి మెప్పించారు. ఆ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిన్నారి ఈ సారా అర్జున్ కావడం విశేషం. అలా అపుడు విక్రమ్ కి కూతురు గా నటించిన సారా ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ లో క్రష్ గా నటించింది. దీనితో ఆమెను పిన్నియిన్ సెల్వన్ లో గుర్తుపట్టినవారంతా మీమ్స్ తో నవ్వులు పూయిస్తున్నారు.































