Sara tendulkar : ఇప్పటి యువతరం ప్రేమలో ఎంత త్వరగా పడతారో అంతే త్వరగా బ్రేక్ అప్ చెప్పేసుకుంటారు. వారికి ఇపుడు ఇవన్నీ కామన్ ఎంత త్వరగా బ్రేక్ అప్ అవుతారో అంతే త్వరగా మళ్ళీ ప్రేమలోనూ పడతారు. ఇపుడు ఈ చర్చంతా మన క్రికెట్ దిగ్గజం సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించే. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో బాగా యాక్టవ్ గా ఉంటూ హీరోయిన్ కి నేనేం తీసిపోను అన్నట్లు గా ఫొటోస్ తో రచ్చచేస్తుంటుంది. ఇక ఈ అమ్మడు ఆ మధ్య హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది అంటూ వార్తలు వచ్చినా అవన్నీ ఒట్టి పుకార్లయ్యాయి.

యువ క్రికెటర్ తో ప్రేమాయణం…
అయితే సినిమాల్లో హీరోయిన్ గా వస్తుందంటూ వచ్చిన పుకార్లు సైలెంట్ అయ్యాక ఇపుడు సారా యివ క్రికెటర్ శుభమన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎపుడు ఫోటోలకు కామెంట్స్ పెట్టుకోవడం వంటివి చేస్తూ అందరినీ డౌట్ లో పడేసారు. అతే ఇటీవలే వీళ్లిద్దరూ బ్రేక్ అప్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి వీళ్ళ ప్రేమ సచిన్ కి ఇష్టం లేదట. ఇక కారణాలు ఏమైనా ఇద్దరూ విడిపోయారు ఇదిగో ప్రూఫ్స్ అంటూ నెటిజన్స్ చూపిస్తున్నారు. శుభమన్ గిల్ ఇటీవలే వెస్టిండిస్, జింబాబ్వే లతో జరిగిన సిరీస్ మ్యాచల్లో మంచి పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక కెరీర్ లో మొదటి సెంచరీ కూడా చేశాడు గిల్. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే శుభమన్ గిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

గతానికి నేను బాధ్యుడిని కాదు ఇక భవిష్యత్తు గురించి మాత్రమే నేను ఆలోచిస్తా అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ సారా తో బ్రేక్ అప్ అయింది కెరీర్ మీద ఫోకస్ చేయడం కోసం ప్రేమ గీమా వద్దనుకున్నాడు గిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు సారా, గిల్ ఇద్దరూ ఆన్ ఫాలోయింగ్ అయ్యారు వారి అకౌంట్స్ నుండి దీంతో అందరూ వీళ్ళిద్దరూ బ్రేక్ అప్ అయ్యారనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏమి కావాలి అంటున్నారు. ఇటీవలే శుభమన్ గిల్ రెడో సారి వరుసగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. ఇక శుభమన్, సారా కన్నా ఒక ఏడాది చిన్నవాడు కావడం విశేషం. మొత్తానికి వీళ్లిద్దరూ బ్రేక్ అప్ అయ్యారనే మ్యాటర్ నార్త్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.




























