Sarkaaru Vaari Paata : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా సర్కారు వారి పాట. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మే 12న వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదటి సారి నటించింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలోని మహేష్ బాబు లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే టికెట్ రేట్లు అధికంగా ఉండడం వలన ప్రేక్షకులు సినిమా థియేటర్ కు రావట్లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు డైలాగులు కొంతమందిని విమర్శించినట్టుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ సినిమాలోని ఒక సీన్ వివాదాస్పదంగా మారుతోంది. ఆ వివాస్పద సీన్ జనసేన పార్టీని ఉద్దేశించి తీసిందని విమర్శలకు దారితీస్తోంది.
హాట్ టాపిక్ గా మారిన గాజు గ్లాస్ సీన్…..

ప్రస్తుతం ఈ సినిమాలోని గాజు గ్లాస్ సీన్ హాట్ టాపిక్ అవుతోంది. అయితే సీన్ ఏంటంటే… సర్కారు వారి పాట సినిమాలో… ఒక సీన్‌లో ప్రభాస్ శ్రీను రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తుంటారు ఆ క్రమం లో తన గొంతులోకి గాజు గ్లాస్‌ను పంపిస్తారు. అయితే గొంతులోకి గాజు గ్లాస్ వెళ్లగానే.. ఏంటండి బాబు, ఇప్పుడు ఇది ఎలా బయటకు వస్తుంది.. అని ప్రభాస్ శ్రీను ప్రశ్నిస్తాడు. దీనికి సమాధానంగా .. రికవరీ ఏజెంట్‌వి కదా.. రికవరీ చెయ్యి.. అంటూ మహేష్ డైలాగ్ వస్తుంది.
అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గుర్తు కూడా గాజు గ్లాసే కావడంతో, దీంతో పవన్ ను, జనసేన పార్టీని టార్గెట్ చేసి ఆ సీన్‌ను తీశారని.. పవన్ ఫ్యాన్స్, ఇంకా జనసేన కార్యకర్తలు ఆరోపనాలు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది పవన్ అభిమానులు సాధారణంగానే ఆ సీన్ పెట్టారని .. అందులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలూ కూడా వస్తున్నాయ్. దీంతో ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఈ విషయం ఇలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.





























