Sarkaaru vaari paata : పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. రెండేళ్ళ తర్వాత మహేష్ బాబు నటించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి తమన్ సంగీతం దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఈ సినిమాపై భారీగా పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేక పోయిన కలెక్షన్లను బాగా రాబట్టింది. ఇక రెండవ రోజు నైజాంలో అధిక టికెట్ రేట్ల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ కనిపించకపోయినా కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్నాయి.

బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం…?
సినిమా విడుదల అయి రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.58.78 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. నిన్న హాలిడే ఎఫెక్ట్ లేకపోయినా కలెక్షన్ బాగానే వచ్చింది. అయితే ఈరోజు, రేపు వీకెండ్ ప్రభావంతో కలెక్షన్ లు పెరిగే అవకాశం లేకపోలేదు. ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల ముందు రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఈ సినిమా ఇంకా రూ.62.22 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్స్ లో మంచి కలెక్షన్ లను రాబట్టి, వీక్ డేస్ లో కూడా సినిమా తన సత్తా చూపిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకోవచ్చు.
సర్కారు వారి పాట’ 2 డేస్ కలెక్షన్స్ ఇలా…
నైజాం రూ.17.44 కోట్లు
సీడెడ్ రూ.6.05 కోట్లు
ఉత్తరాంధ్ర రూ.6.27 కోట్లు
ఈస్ట్ రూ.4.33 కోట్లు
వెస్ట్ రూ.3.19 కోట్లు
గుంటూరు రూ.6.34 కోట్లు
కృష్ణా రూ.3.13 కోట్లు
నెల్లూరు రూ.1.97 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్) రూ.47.72 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.31 కోట్లు
ఓవర్సీస్ రూ.7.75 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) రూ.58.78 కోట్లు



























