Sathya Prakash : ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యప్రకాష్ గారు. ఒడిశా లో పుట్టి పెరిగిన సత్య ప్రకాష్ గారు వెంకటేష్ హీరోగా వచ్చిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా ద్వారా విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. కన్నడ, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ విలన్ గా నటించిన ఆయన తన జర్నీ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక సినిమాల్లో నటించే సమయంలో ఒక విలన్ కు ఎక్కువగా దెబ్బలు తగిలే ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితులను సత్య ప్రకాష్ ఎదుర్కొన్నారా అనే విషయాలను ఆయన పంచుకున్నారు.

వెంకటేష్, సుమన్ నన్ను కాపాడారు…
‘జయం మనదేరా’ సినిమా షూటింగ్ సమయంలో మహానంది లో సోలో ఫైట్ సీన్ లో వర్షములో కాలు జారి ఎత్తు నుండి కిందపడిపోతున్న సమయంలో వెంకటేష్ తన చొక్కా పట్టుకుని పైకి లాగి కాపాడటంతో బ్రతికానని లేకపోతే అలానే జారి కిందకు పడుంటే అక్కడ ఉన్న సిమెంట్ ఇటుకలు తలకు తగిలి పోయేవాడిని అంటూ సత్య ప్రకాష్ చెప్పారు. ఇక మరో సారి సుమన్, ప్రకాష్ రాజ్, అరుణ్ పాండ్య ముగ్గురు హీరోలుగా చేస్తున్న సినిమాలో విలన్ గా సత్య ప్రకాష్ చేస్తున్న సమయంలో హీరో సుమన్ తో ఫైట్ సీన్ లో సుమన్ కొట్టగానే వెనకాల ఉన్న గ్లాస్ కు తగిలి అది పగిలిపోవాలి. అయితే సాధారణంగా సినిమా షూటింగ్ లకు షుగర్ గ్లాస్ పెడతారు కానీ ఒరిజినల్ గ్లాస్ పెట్టడం వల్ల తగలగానే ముక్కలై బాలన్స్ తప్పి సత్యప్రకాష్ కింద పడటంతో ఆయన తొడకు గాజు ముక్కలు గుచ్చుకున్నాయట.

అయితే అదే సమయంలో తల కిందకు పడే సమయంలో సుమన్ పట్టుకోవడం వల్ల తలకు గాయాలు కాలేదు బ్రతికాను అంటూ చెప్పారు. ఇక దెబ్బలు తగిలి కుట్లు పడటం తో విశ్రాంతి కోసం చెన్నై వెళ్తున్న సమయంలో ఫ్లైట్ లో సత్య ప్రకాష్ తో పాటు ప్రకాష్ రాజ్ కమెడియన్ సెంథీల్ ఉన్నారట. తొడకు వెనుక భాగంలో కుట్లు పడటం వల్ల సరిగా కూర్చోడానికి రాక ఇబ్బంది పడుతున్న సత్య ప్రకాష్ తో జోకులు వేసుకుని ప్రకాష్ రాజ్ సెంథీల్ చెన్నై వచ్చే వరాకు నవ్వుకున్నారట. చెన్నై లో దిగాక ప్రకాష్ రాజ్ అలా కావాలనే చేసాం లేకపోతే నువ్వు ఆ గాయం గురించే ఆలోచిస్తూ ఇంకా నొప్పి ఫీల్ అవుతావని అంటూ చెప్పారట. ఇలాంటి సంఘటనలను సత్య ప్రకాష్ గారు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.



























