Sebastian : క్రైస్తవ మతప్రచారకుడైన సెబాస్టియన్ రాజకీయంగా క్రైస్తవుల పాత్ర గురించి మాట్లాడుతూ బీజేపీ క్రైస్తవులను కావాలనే పదవులకు దూరం చేస్తోందంటూ అందుకు తగ్గట్టుగా చట్టాలను రూపొందిస్తున్నారు అంటూ ఆరోపణలు చేసారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఒక్క క్రైస్తవుడైనా రాజకీయ పదవుల్లో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు.

రాజశేఖర్ రెడ్డి కుటుంబం క్రైస్తవులు కాదు…
ఇక సెబాస్టియన్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి సంచలన కామెంట్స్ చేసారు. వైఎస్సార్ కుటుంబం ఒకప్పుడు క్రైస్తవ కుటుంబం కానీ ఇప్పుడు కాదు అంటూ కామెంట్స్ చేసారు. రాజకీయ పదవుల్లో క్రైస్తవులు లేరు అన్న అంశం మీద మాట్లాడుతూ సెబాస్టియన్ ఈ కామెంట్స్ చేసారు. బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్ కాదా అలాంటపుడు వారు క్రైస్తవ కుటుంబం కాదని ఎలా అంటారు అనే ప్రశ్నకు బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్ కాదు బాప్తిసం తీసుకోలేదు అంటూ తెలిపారు.

కేఏ పాల్ ఎలాగైతే బాప్తిసం తీసుకోలేదో అలానే బ్రదర్ అనిల్ కూడా బాప్తిసం తీసుకోలేదు. క్రైస్తవులకు పాస్టర్, ఫాదర్ అవ్వాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. బ్రదర్ అనిల్ ఇమ్మానుయిల్ అంతే. ఇమ్మానుయేల్ అంటే దేశాలు తిరుగుతూ మత ప్రచారం చేసే వాళ్ళు అంతే కానీ అతను పాస్టర్ కాదు ఫాదర్ కాదు అంటూ తెలిపారు. ఇక క్రైస్తవ మత ప్రచారకులకు దేవుడిని ప్రార్థిస్తారు కాబట్టి అన్ని ఫండ్స్ వస్తాయి అంటూ తెలిపారు.

































