Seenu Vaitla : ‘నీ కోసం’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న శీను వైట్ల ఆ తరువాత సొంతం, వెంకీ, ఢీ, దూకుడు, దుబాయ్ శీను, ఆగడు, బాద్ షా వంటి సినిమాల ద్వారా టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. సినిమాల్లో ఫెయిల్యూర్స్ రావడం మామూలే. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము. ఒకసారిగా టాప్ పొజిషన్ కి వెళ్లి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోతారు. ఆ వెంటనే ఫెయిల్యూర్స్ కెరీర్ ను నాశనం చేస్తాయి. వీటికి ఎవరూ అతీతం కాదు. అలానే శీను వైట్ల జీవితంలో కూడా ఎలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వరుస వైఫల్యాలు పలకరించి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

వాళ్ళు ముగ్గురే నా జీవితం…
శీను వైట్ల కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగాను ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. శీను ఆయన భార్య రూప ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో శీను వైట్ల తాజాగా చేసిన ఎమోషనల్ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. శీను వైట్ల తన కూతుళ్ళ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెటిజన్స్ ని కుడా ఎమోషనల్ చేసింది.

Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022
జీవితం అందమైనది. నచ్చిన వ్యక్తులతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురూ లేకుండా నా జీవితాన్ని ఉహించుకోలేను అంటూ కూతుళ్ళ గురించి రాసుకొచ్చారు. తన సినిమాల ద్వారా అందరిని నవ్వించే శీను వైట్ల ఇలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టడంతో నెటిజన్స్ కూడా మీ భాధలు త్వరగా తీరిపోయి మళ్ళీ మీరు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది ఆకాంక్షిస్తున్నారు.



























