Senior Actor Bhanu Chandhar : యాక్షన్ సినిమాలతో అలరించిన అలనాటి నటుడు భాను చందర్. కరాటే బ్లాక్ బెల్ట్ అయిన భాను చందర్ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారైనా ఆయన పెరిగింది మద్రాస్. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భాను చందర్ రజనీకాంత్ కి జూనియర్ అలానే చిరంజీవి వంటి సూపర్ స్టార్లు ఆయన సమకాలిన నటులు. భాను చందర్ గారి తండ్రి మాస్టర్ వేణు గారు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆయన తన కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదు. తెర వెనుక కాదు తెర ముందు నువ్వు కనిపించాలని భాను చందర్ గారికి చెప్పేవారట. ఇలాంటి మరిన్ని విశేషాలను నటుడు భాను చందర్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

డ్రగ్స్ అడిక్టర్ గా ఉన్నా.. నాన్న మరణం…
చెన్నైలో చదివిన భాను చందర్ ముంబైలో పై చదువులు చదవడానికి వెళ్లారు. అలా అక్కడ కొత్త స్నేహాలు మొదలై డ్రగ్స్ కి అలవాటు పడి బాగా డ్రగ్స్ తీసుకునేవారట. డ్రగ్స్ తీసుకున్నంత కాలం ఏమీ తెలియక పోయినా మళ్ళీ దాని దుష్ప్రభావాలు తెలిసాయి అంటూ భాను చందర్ తెలిపారు. ముంబైలో చదువుతున్న సమయంలోనే తల్లి చూడటానికి వచ్చి భాను చందర్ గారు బక్కచిక్కిపోయి ఉండటం చూసి బోరున ఏడ్చేశారట. ఇక చదువుయ్యాక చెన్నై వచ్చిన భాను చందర్ ఏం చేయాలో తెలియక ఉంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని స్నేహితులే సలహా ఇచ్చారట. అలా కరాటే లాంటివి నేర్చుకోడానికి చేరి డ్రగ్స్ ని దూరం పెట్టారట. అలా తన జీవితంలోకి మార్షల్ ఆర్ట్స్ వచ్చాక చాలా క్రమశిక్షణ, ఫిట్నెస్ నేర్చుకున్నానని చెప్పారు. తండ్రి మాస్టర్ వేణు గార తమలపాకు ఎక్కువగా తినేవారట.

టోబాకో ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో క్యాన్సర్ వచ్చి మరణించారని హీరో అయ్యాక ఆయన మ్యూజిక్ కంపోసిషన్ లో ఒక్క సినిమా అయినా చేయాలన్నది కోరికగా ఉండేదని చెప్పారు భాను చందర్. ఇక తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అన్ని మతాల పండుగలు జరుపుకుంటామని తెలిపారు. దీనికి కారణం తన తల్లి క్రిస్టియన్ స్కూల్ లో చదివే సమయంలో తనకు చిన్నతనంలోనే అరుదైన వ్యాధి ఉండేది తనకు ముక్కు నుండి నీరు ఎపుడూ కారుతూ ఉండేదని, ఆ వ్యాధికి చికిత్స కూడా ఉండేది కాదని తెలిపారు. అయితే తోటి విద్యార్థులు తనతో కూర్చోకపోవడం మాట్లాడకపోవడంతో చాలా బాధపడేది. ఆ సమయంలో ఒక సిస్టర్ బైబిల్ ఇచ్చి చదవమని చెప్పడం మూడో రోజుకే ఆ వ్యాధి నయం అవడం అంతా మిరాకల్ గా జరిగిందట. అందుకే అప్పటి నుండి హిందువులం అయినా యేసుప్రభువును ప్రార్థిస్తాం అలాగే దర్గా వెళ్లి వస్తాం అంటూ చెప్పారు భాను చందర్.































