Senior Actor Bheemeswararao : పాత సినిమాల్లో జడ్జి అయినా పోలీస్ అధికారి అయినా కనిపించే వ్యక్తి దాదాపు చాలా సినిమాల్లో బీమేశ్వర రావు గారే. పలానా పాత్ర అని గుర్తు పెట్టలేము కానీ చాలా సినిమాల్లో డాక్టర్, పోలీస్, జడ్జి, కలెక్టర్ ఇలా ఎన్నో పాత్రలలో ఆయన కనిపించారు. చేబ్రోలు నుండి సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఎంతో మంది డైరెక్టర్లతో అలాగే హీరోలతో కలిసి పనిచేసారు. అప్పట్లో ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలో నటించిన ఆయన అప్పటి సినిమా అనుభవాలను పంచుకున్నారు.

నాగేశ్వరావు గారు అదో టైపు…
అక్కినేని గారితో చాలా సినిమాలో నటించిన బీమేశ్వర రావు గారు అయన గురించి మాట్లాడారు. నాగేశ్వరావు గారు చాలా సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోయినట్లు ఉంటారు కానీ కొంత వెటకారం ఆయన మాటల్లో ఉంటుంది అంటూ చెప్పారు. ఆయనతో ఒక సినిమాలో చేసేటపుడు జైలర్ పాత్రలో నటించాను.

అయితే ఆ సినిమాలో నేను నాగేశ్వరావు గారిన కొట్టాలి, ఆ సీన్ చేసేటపుడు నాగేశ్వరావు గారు పర్వాలేదు సీన్ కోసం చేయాలి కదా కొట్టండి అని చెప్పారు. అయితే ఆయన మాటల్లో అర్థం నాకు తెలుసు అందుకే నిజంగా కొడితే ఇంకేమైనా ఉందా.. అని నేను కొట్టినట్టు నటించాను కానీ కొట్టలేదు. ఎవరితోనూ స్నేహం చనువు ఉండేవి కాదని కేవలం శోభన్ బాబు గారితో మాత్రమే కొంత చనువుగా ఉండేవాడినంటూ బీమేశ్వరావు గారు తెలిపారు.






























