Senior Actor Chandhra Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలలో ఒదిగి పోయి ఆతరం నటులతోను ఇటు ఈ తరం నటులనతోను అందరితోనూ నటించిన వ్యక్తిగా చంద్ర మోహన్ నిలిచిపోయారు. ఇంకొంచం పొడవు ఉండి ఉంటే చంద్ర మోహన్ ఒక పెద్ద హీరో అయ్యేవాడు అంటూ నాగేశ్వరావు గారు స్వయన అనడం చంద్ర మోహన్ గారి నటనకు అవార్డు లాంటిది. అప్పట్లో అగ్రహీరోలకు సమానంగా సినిమాలను చేస్తూ హిట్లు కొట్టారు చంద్ర మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కెరీర్ కి సంబంధిచిన ఎన్నో విషయాలను అలాగే తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలను పంచుకున్నారు.

గోపీచంద్ చాలా అడిగాడు…..
చంద్ర మోహన్ గారు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు . ఎంతోమంది మంది యువ హీరోలకు తండ్రి గా నటించిన ఆయన చాలా సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలను చేస్తున్న సమయంలో చంద్ర మోహన్ గారికి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల ఇబ్బంది పడ్డారట. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఏమి లేవు, సినిమాల్లో గుర్తింపు కొత్తగా తెచ్చుకోవాల్సింది లేదు ఇక ఎందుకు ఆరోగ్యాన్ని పోగొట్టుకుని సినిమాలను చేయాలి అని అలోచించి సినిమాలకు దూరం అవ్వాలని అనుకున్నారట చంద్ర మోహన్.

అయితే గోపీచంద్ హీరోగా చాలా సినిమాల్లో తండ్రి వేషం వేసిన చంద్ర మోహన్ గారు ఇక సినిమాల్లో నటించను అన్నపుడు గోపిచంద్ అడిగారట నా సినిమాల్లో మాత్రం నటించండి. మిగతా సినిమాలు కట్ చేయండి కానీ నా సినిమాలు కట్ చేయకండి అని అడిగాడట. అయితే ఆరోగ్య సమస్యల వల్ల అనవసరంగా సినిమా యూనిట్ ను కూడా ఇబ్బంది పెట్టకూడదని దూరంగా ఉంటున్నానని చంద్ర మోహన్ తెలిపారు. గోపీచంద్ కు మొదటి నుండి తండ్రి గా నటించిన ఆయన చివరగా ఆక్సిజన్ సినిమాల్లో నటించారు.































