Senior Actor Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ. బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికి గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం వంటి సినిమాల్లో నటించిన ఝాన్సీ గారిని చూడవచ్చు. ఎన్నో సినిమాల్లో నటించి ఆర్థికంగా బాగా సంపాదించుకున్నా నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదీస్తున్నారు ఝాన్సీ. అప్పట్లో అగ్ర నటులతో పనిచేసిన ఝాన్సీ గారు అప్పటి అనుభవాలను పంచుకున్నారు.

కాంచన, షావుకారు జానకి తో మాట్లాడి ఎమోషనల్…
ఝాన్సీ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర నటులతో మొదలు కృష్ణ, కృష్ణం రాజు శోభన బాబు ఇలా అప్పటి యువ హీరోల సినిమాల్లో నటించారు ఝాన్సీ. ఇక హీరోయిన్లు సావిత్రి, కే ఆర్ విజయ, షావుకారు జానకి, కాంచన, భానుమతి ఇలా అందరితో నటించారు. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చినందుకు ఇంటర్వ్యూలో అలనాటి నాటిమనులతో చాలా ఏళ్ళ తరువాత ఫోన్ లో మాట్లాడారు.

కాంచన గారు ప్రస్తుతం ఆధ్యాత్మికత వైపు మళ్లారు. ఇక షావుకారు జానకి గారు కూడా ప్రస్తుతం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వీరిద్దరితో ఝాన్సీ గారు పనిచేశారు. అలానే వారితో మంచి అనుబంధం కూడా ఉంది. ఇక దాదాపు 15 ఏళ్ళ తరువాత మళ్ళీ వారితో మాట్లాడిన ఝాన్సీ గారు ఎమోషనల్ అయ్యారు. అప్పటి అనుభవాలను తలచుకున్నారు.



























