Senior Actor Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనీజం రెండింటిని పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

నేను బ్రాహ్మణుడని చెప్పలేను….
కాకరాల రాజమండ్రి సమీపంలోమి గ్రామంలో జన్మించిగా ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇక అదే రాజమండ్రి కి చెందిన డాక్టర్ రాజారావు గారి వద్ద నాటకాలలో నటిస్తూ ఆయనను గురువుగా భావించి ఆయన వద్దకు మధ్రాస్ వెళ్లిన కాకరల గారు అయన బ్రాహ్మణ కులం అని చెప్పుకోరు. రాజకీయాలోకి వచ్చిన రోజునే కులాన్ని వదిలేసానని చెప్తారాయన. కులం ఏంటో చెప్పొచ్చు కానీ కులతత్త్వం ఉండకూడదు నా కులం గొప్ప నా కులమే అనే భావన సమాజానికి మంచిది కాదు అంటూ కాకరాల చెబుతారు.

సినిమాల్లో కూడ కులాన్ని ఏనాడూ ప్రస్థావించలేదని నేను రాజకీయాల్లో ఎలా ఉన్నానో అలానే ఇప్పుడు నా కూతుర్లిద్దరు రహస్య ఉద్యమల్లో ఉంటూ వారి జీవితం వారు చూసుకుంటానున్నారని తెలిపారు. ఇక ఆయన గురువు డాక్టర్ రాజారావు గారి గురించి మాట్లాడుతూ ఆయన నాలాంటి ఎంతో మంది శిష్యులను తయారు చేసారని చెప్పారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడ ఆయన శిష్యుడే. డైలాగులు పలకడం వంటివి కృష్ణకు నేర్పింది రాజారావు గారే మేకప్ మ్యాన్ మాధవరావు , కృష్ణ గారిని రాజారావు గారి వద్దకు తర్ఫిదు కోసం తీసుకోచ్చారు అంటూ కాకరల తెలిపారు.