Senior actor Prakash Raj : విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమాలే కాకుండా ప్రస్తుతం పాలిటిక్స్ లోనూ విలక్షణంగానే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటకలో చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించిన ప్రకాష్ ఆ తరువాత తమిళ సినిమా ద్వారా సినిమాకు పరిచయమైయ్యడు. ఆ తరువాత తెలుగు, మలయాళం అంటూ అన్ని భాషలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ నటన సినిమాకు ప్లస్ అనేలా ఆయన నటిస్తారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ విలనిజం చూపించినా, అంతఃపురంలో ఫ్యాక్షన్ నేతగా చేసినా, ఖడ్గంలో ఒక భారతీయ ముస్లిం గా నటించినా అన్నింటిలోనూ తన పాత్రకు న్యాయం చేసాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ విశేషాలను పంచుకున్నారు.

కృష్ణవంశీ మీద అరిచేసాను…
తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను చేసిన ప్రకాష్ రాజ్ ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు అనే పేరుంది. అయితే సినిమాల్లో నటించే సమయంలో డైరెక్టర్ ఇచ్చే సలహాలు తనకు ఏం కావాలో చెప్పే తీరును బట్టే నటన ఆధారపడి ఉంటుందని వివరించారు. కృష్ణ వంశీ తీసిన అంతఃపురం సినిమాలో నటించేటప్పటికే నేషనల్ అవార్డు అందుకున్నా ఆ సినిమాలో ఒక సీన్ కోసం దాదాపు 14 టేకులు తీసుకున్నానంటూ చెప్పారు.

ఎన్నిసార్లు చేసినా కృష్ణ వంశీ వన్ మోర్ అనే సరికి అసలు నీకు ఏమి కావాలి రా అని గట్టిగా అరిచారట. అయితే అప్పటికే నేషనల్ అవార్డు అందుకున్న నేను ఇన్ని టేకులు తీసుకోవడం ఏమిటి అనేది ఒకవైపు టెన్షన్ ఉండగా మరో వైపు కృష్ణ వంశీకి ఒక పెద్ధ ఆర్టిస్టు తో ఇన్ని టేకులు తీసుకుంటున్నాను అని కోపం వస్తుందేమో అనే భయం ఉందట. ఇక చివరికి కృష్ణ వంశీ ఆ సీన్ లో మీరు పగ చల్లారినా కూతురు విధవ అవుతుండడం చూసి అంత పెద్ధ ఫ్యాక్షనిస్టు అయినా ఏమి చేయలేని నిస్సహాయత కనిపించాలి అలా ఏడవండి అని చెప్పడంతో అప్పుడు సీన్ ఓకే అయింది అంటూ నా నటనకు మంచి మార్కులు పడ్డాయంటూ చెప్పారు.































