Senior Actor Thulasi : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి హీరోయిన్ గా, అలాగే హీరో చెల్లి పాత్ర, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా మెప్పించిన నటి తులసి మూడువందలకు పైగా సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో నటించిన తులసి అందరు గొప్ప దర్శకుతో పని చెయడం గొప్పగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఇక సినిమాల్లో కే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది, అందునా ‘శంకరాభరణం’ సినిమాలో శంకర్ శాస్త్రి వద్ద అబ్బాయిగా తులసి నటన అందరినీ అక్కట్టుకుంటుంది. ఆ ఒక్క సినిమాతో నటనలో వంద మెట్లు ఎక్కేసింది తులసి. ఇక ఈ మధ్యనే విడుదల అయిన ‘కార్తికేయ 2’ సినిమాలో కూడా తన నటనతో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు.

పొద్దున్న కలిసాను సాయంత్రం పెళ్లి చేసుకున్నాను…
తులసి గారి సినిమా జీవితం పక్కనపెడితే ఆమె వ్యక్తిగతంగా సాయి బాబా భక్తురాలు, ఆమె తన తాత గారి పెంపకంలో పెరగడం వల్ల ఆయన వ్యక్తిత్వ ప్రభావం ఎక్కువగా ఆమె పై ఉంది. ఆమె తన చిన్నతనంలోనే తులసి బాబా భక్తుడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేదట. ఇక తులసి గారి తాతగారు నువ్వు ఒక్కరోజులోనే పెళ్లిచేసుకుంటావని చెప్పారట. అలానే తాను ఒక కన్నడ సినిమా లో నటించడానికి వెళితే ఆ సినిమా డైరెక్టర్ శివమణి తో పరిచయం ఏర్పడింది. దేవరాజ్ గారు హీరోగా, నిరోషా హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో ఒక పాత్ర కోసం తులసి గారిని తీసుకున్నారట.

అయితే ఆయనతో పరిచయం ఏర్పడ్డాక ఆయనకు సాయి బాబా ఫోటో కూడా ఇచ్చారట. ఇక సాయంత్రానికి ఒకరంటే ఒకరికి నచ్చి పెళ్లి చేసుకున్నారట. ఆ పెళ్లి కూడా తులసి గారి తాతగారు కట్టించిన గుడిలోనే జరిగిందట. శివమణి గారు మళయాళి, ఆయన కుటుంబం ఒప్పుకోడానికి ఒక మూడు రోజుల సమయం పట్టినా మెల్లగా వాళ్ళు ఒప్పుకున్నారట. ఇక తులసి వాళ్ల ఇంటికి ఫోన్ చేసి తన తాత గారికి చెబితే బాబా నిన్ను చల్లగా చూసుకుంటాడు అంటూ చెప్పారట. అలా వారి పెళ్లి జరిగి ఒక బాబు సాయి తరుణ్ ఉన్నాడు. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా జీవితంలో కలిసి ఉన్నాం అంటూ తులసి తన వైవాహిక బంధం గురించి చెప్పారు.































