Senior Actress Jamuna : వాళ్ళు అలా చెప్పుకుంటారు కానీ ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకువచ్చింది ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కాదు… అసలు తెచ్చింది ఎవరంటే…: సీనియర్ నటి జమున

0
868

Senior Actress Jamuna : తెలుగు ప్రేక్షకులకు సత్యభామ ఎవరంటే అది ఖచ్చితంగా అలనాటి నటి జమున గారే అని ఎవరైనా చెప్పేస్తారు. పౌరాణిక సినిమాలైనా, జానపద సినిమాలైనా, ఆమె ఏ పాత్రలో నటించినా అందులో ఒదిగిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలకు ధీటుగా నటించి మెప్పించిన ఆమె కుర్రహీరోలతో ఎక్కువ సినిమాల్లో నటించి వారికి స్టార్డమ్ తెచ్చిపెట్టారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఉన్న జమున గారు ఎన్నో కాంట్రావర్సీలకు కేర్ అఫ్ గా అప్పట్లో నిలిచారు. ఏకంగా అగ్రహీరోలు ఆమెపై అనధికార బ్యాన్ విధించినా తట్టుకుని అగ్ర హీరోయిన్ గా ఎదిగిన ఆమె రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే ఆమె ఇండస్ట్రీ గురించి హీరోల గురించి గతంలో చెప్పిన మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీని హైదరాబాద్ కు తెచ్చింది వాళ్ళని చెప్పుకుంటారు…

జమున గారు తన కెరీర్ అలానే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల గురించి మాట్లాడుతూ హైదరాబాద్ కు ఇండస్ట్రీ తరలిరావడానికి ఎన్టీఆర్ గారు మరీ ముఖ్యంగా ఏఎన్ఆర్ గారు కారణం అని చెబుతారు కానీ అది వాస్తవం కాదు. వాళ్ళు అలా చెప్పుకుంటారు అంతే అంటూ చెప్పారు. అసలు మొదట హైదరాబాద్ కి ఇండస్ట్రీని తెచ్చింది గంగాధర్ గారు అంటూ సారధి స్టూడియోలో మా ఇంటి మహాలక్ష్మి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చేసారు.

ఆంధ్ర రాజధానిలో నిర్మించిన తొలి సినిమా అదేనంటూ జమున తెలిపారు. 1959 లోనే ఆ సినిమాను డైరెక్టర్ రామినీడు గారు హైదరాబాద్ సారధి స్టూడియోలో తీసారని, ఆ సినిమా చేసే సమయంలో సారధి స్టూడియో పరిసరాల్లో మంచి హోటల్స్ కూడా ఉండేవి కాదని స్టూడియోలోనే రూమ్స్ ఇస్తే అక్కడే ఉండేవాళ్లమంటూ చెప్పారు. కానీ ఇండస్ట్రీని మేమే హైదరాబాద్ తీసుకువచ్చాముంటూ వీళ్ళు చెప్పుకుంటున్నారు అంటూ చెప్పారు.