Senior Actress Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

చిరంజీవితో చేయమని హీరోయిన్స్ అనేవారు…
పునాదిరలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గారితో ఆ తరువాత వెంకన్న బాబు గారు చేసిన సినిమా ఊరికిచ్చిన మాట లో హీరోయిన్ గా చేయడానికి అప్పటి హీరోయిన్స్ అంగీకరించక పోవడం వల్ల కవిత గారికి ఆఫర్స్ వచ్చాయట. అలా వరుసగా సినిమాలను చిరు తో చేశారట. ఊరికిచ్చిన మాట, శ్రీరస్తు శుభమస్తు, ఆరని మంటలు, తాతయ్య ప్రేమలీలలు ఇలా వరుసగా చేశారు. ఇక బాలకృష్ణ తో నటించే అవకాశం రాలేదంటూ కవిత గారు చెప్పారు.

కవిత హీరోయిన్ గా చేస్తున్న సమయంలో బాలకృష్ణ ఇంకా అంత సినిమాలను చేస్తూ లేడని చెప్పారు. ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తున్నపుడు బాలకృష్ణ, హరికృష్ణ షూటింగ్ సెట్స్ కి వచ్చేవారు, సినిమాకు సంబంధిచిన పనులను చూసుకునేవారు అయితే మేకప్ లో ఎపుడూ బాలయ్యని చూడలేదు. ఆయన హీరో అయ్యాక అప్పటికే డైరెక్టర్స్ కోదండ రామిరెడ్డి వంటి వారు వచ్చేసారు ఇంకా హీరోయిన్స్ విజయశాంతి, రాధ, భానుప్రియా వచ్చేసారు అందువల్ల ఆయనతో చేసే వీలుపడలేదు అంటూ చెప్పారు.

































