Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.
అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























