Senior Actress PR Varalakshmi : అలనాటి నటుల్లో వరలక్ష్మి అని పేరు పెట్టుకున్న అందరు నటీమనుల్లో అందరూ సక్సెస్ అయినవారే. నగరికి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు కృష్ణావతారం సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోను నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు అలానే తన కుటుంబం గురించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు వరలక్ష్మి.

శోభన్ బాబు గారు చాలా తక్కువగా మాటాడుతారు…
అలనాటి అగ్ర హీరోలతో పనిచేసిన వరలక్ష్మి గారు అప్పటి సీనియర్ హీరోల గురించి మాట్లాడుతూ శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజుల గురించి మాట్లాడారు. కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరూ వెనువెంటనే మరణించడం చాలా బాధించిందని తెలిపారు. అలానే వారిద్దరితో పని చేయడం చాలా బాగా అనిపించేదని చెబుతూ అలానే శోభన్ బాబు గారి గురించి వివరించారు.

శోభన్ బాబు గారితో చాలా సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు ఆయన గురించి మాట్లాడుతూ చాలా క్రమశిక్షణ తో పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ ని చక్కగా బ్యాలన్స్ చేస్తారంటూ చెప్పారు. శనివారం, ఆదివారం ఆయన ఎట్టి పరిస్థితిలోనూ షూటింగ్ రారంటూ చెప్పారు. ఆ రెండు రోజులు కుటుంబంతో గడుపుతారని, అలానే డబ్బు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారంటూ చెప్పారు. అందరికీ డబ్బు భూమి మీద పెట్టమని సలహాలు ఇస్తారని చెన్నై లో ఎన్నో భూములు ఆయనవే అంటూ చెప్పారు.