Senior Actress Sudha : శరత్ బాబు గారితో చివరిసారిగా మాట్లాడింది అదే…ఎమోషనల్ అయిన నటి సుధ

0
17

Senior Actress Sudha : విలక్షణ నటుడు విలన్ గాను,హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదల వలస లో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకొక చిలుక,చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981,88,89 మూడు సార్లు ఉత్తమం సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గారు పోరాడి ఓడిపోయారు. ఆయన గురించి ఆయనతో కలిసి పని చేసి మంచి అనుబంధం ఉన్న నటి సుధ ఆమె జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఆయనతో చివరిసారిగా మాట్లాడింది అదే….

శరత్ బాబు గారితో కలిసి చాలా సినిమాల్లో నటించిన సుధ గారికి ఆయనతో చక్కటి అనుబంధం ఉంది. చివరగా ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందే ఆయనను కొమొన ఫ్రెండ్ ద్వారా కలిసిన సుధ గారు దాదాపు మూడుగంటల పాటు ఆయనతో మాట్లాడుతూ కూర్చున్నారట. ఆ సమయంలో కాస్త బాగోలేదు అంటూ వాళ్లకు తెలిసిన వాళ్లకు చెప్పారట. సుధ గారిని చూడగానే ఎన్ని రోజులైంది చూసి అంటూ ఆప్యాయంగా మాట్లాడించారట .

ఇక ఆయన ఆడవాళ్ళను చాలా గౌరవిస్తారు అంటూ చెప్పారు సుధ గారు. శరత్ బాబు గారి డైరెక్షన్, ప్రొడక్షన్ లో నటించినపుడు కూడా ఆయన చాలా బాగా చూసుకున్నారు అంటూ ఆయన ఇలా మరణించడం చాలా బాధగా ఉందని చివరిసారిగా ఆయనను ఒకసారి చూడాలని అనుకుంటే ఆయనను చూడటానికి కుదరలేదు అంటూ చెప్పారు. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ఎవరిని అనుమతించలేదని శరత్ బాబు గారి సోదరి చెప్పడం వల్ల నేను హాస్పిటల్ వెళ్లలేక పోయానని చెప్పారు సుధ.