Senior Analist Adusumilli Srinivasarao : నందమూరి తారకరత్న మరణించాక ఆయన మరణానికి కారణం లోకేష్ పాదయాత్ర అంటూ విమర్శిస్తున్న వాళ్లలో లక్ష్మీపార్వతి ఒకరు. నిజానికి తారకరత్న లోకేష్ పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన ఆరోజే జనవరి 27న మరణించినా చంద్రబాబు దాచిపెట్టి తారకరత్న ను హాస్పిటల్ చికిత్స పేరుతో ఉంచి ఇప్పుడు మరణించాడని బయటికి చెప్పారంటూ ఒకవైపు వినిపిస్తున్నా వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా తారకరత్న హాస్పిటల్ లో ఉన్నపుడు వెళ్లి పరామర్శించడం మీడియా ముందు కోలుకొంటాడు అంటూ మాట్లాడటం జరిగింది. అయితే తారకరత్న మరణించి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే ఇలాంటి చర్చలేమిటి అనే వాదన ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఛాన్స్ వస్తే విమర్శించడానికి రెడీ గా ఉండే లక్ష్మి పార్వతి గారు తారకరత్న మరణం గురించి మీడియాతో మాట్లాడారు. ఆ రోజు నా భర్త ఈరోజు నా మనవడు చంద్రబాబు, లోకేష్ స్వార్థంకు బలయ్యారు. నా కుటుంబంలో తీరని విషాదనికి కారణం వాళ్లే, ఇంకెంతమంది వారి వల్ల బలవ్వాలో అంటూ విమర్శించారు.

నా కుటుంబం అనుకుంటే ఇలా మాట్లాడవు…
లక్ష్మి పార్వతి చేసిన వాఖ్యలకు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఫైర్ అయ్యారు. నా కుటుంబం అని ఆమె నిజంగానే అనుకుని ఉంటే మీడియా ముందుకు వచ్చి చనిపోయిన వ్యక్తిగత గురించి రాజకీయం చేయదు. పుట్టెడు దుఃఖంలో కుటుంబం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదు అంటూ అభిప్రాయపడ్డారు. ఇలాగే లక్ష్మి పార్వతి ఛాన్స్ దొరికినప్పుడల్లా నందమూరి కుటుంబం గురించి మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఊరికే ఉన్నట్లు నా లాంటి వాళ్ళు ఊరికే ఉండరు. ఈమె మొదటి భర్త, వారికి పుట్టినరోజు కొడుకు గురించి వెతికి మరి ఆయన ఎక్కడున్నాడో వెళ్లి నీ కుటుంబం గురించి మాట్లాడుతాం. పెంట కుప్పలో రాయి వేసినట్లుగా ఉండే ఈమె ప్రవర్తన వల్లే చంద్రబాబు ఈమె ఏం మాట్లాడినా మౌనంగా వదిలేసాడు. అదే ఆయన చేసిన తప్పు.

ఇప్పుడు నా భర్త అని చెప్పుకునే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కి వ్యతిరేకమైన పార్టీ పంచన చేరి నందమూరి కుటుంబ పరువు తీస్తోంది. నందమూరి వంటి పచ్చని కుటుంబానికి పట్టిన చీడ ఈ లక్ష్మి పార్వతి అంటూ ఘాటు వాఖ్యలు చేసారు. మీడియా వాళ్ళు కూడా ఈమెతో విలువైన పర్సన్ అన్నట్లుగా ఆమె మూతి ముందదు మైకు పెడతారు. కుటుంబం అనుకుంటే సానుభూతి తెలపాలి కానీ రాజకీయాలు చేయకూడదు. నీలాగే విజయసాయి రెడ్డి చేసాడా, అతను వెళ్లి చూసి వచ్చి చెప్పాడు కాదా చికిత్స జరుగుతోందని మరి ఆ మాట సంగతి ఏమిటి అంటూ లక్ష్మీపార్వతి మీద ఫైర్ అయ్యారు అడుసుమిల్లి శ్రీనివాసరావు.
































