Senior Artist Chalapathirao : తెలుగులో మొదట్లో విలన్ గాను ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో చేసిన చలపతిరావు గారు చాలా సినిమాల్లో నటించినా ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా అందరికీ తెలుసు. ఆయన తనయుడు రవి బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. విభిన్నమైన సినిమాలను తీస్తూ పేరు తెచ్చుకున్నాడు. అల్లరి, అవును, నచ్చావులే అంటూ సినిమాలను తీసి మంచి హిట్లను కూడా అందుకున్నాడు. ఇక చలపతి రావు గారి కుటుంబం వ్యవసాయిక కుటుంబం. నాటకాలు, సినిమాల మీద మక్కువతో చలపతి రావు గారు సినిమాల్లోకి వచ్చారు. ఆయన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

వారానికే పెళ్లి… భార్య చనిపోతే పెళ్లి చేసుకోలేదు…
సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న చలపతిరావు గారు విజయవాడ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించగా ఆమె పెళ్లి చేసుకుందామా అని అడిగారట. అలా పరిచయమైన వారం రోజుల్లోనే ప్రేమించిన అమ్మాయిని స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. చలపతిరావు గారిది పెద్ద కుటుంబం కావడంతో ఒప్పుకోలేదు కానీ ఆయన తన భార్య ను తీసుకుని చెన్నై వచ్చేసారు. ఆమె చాలా ధైర్యవంతురాలంటూ చలపతిరావు గారు చెబుతారు. డైరెక్ట్ గా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి నా భర్త శోభన్ బాబు లాగా ఉంటాడు. మంచి వేషాలు ఎందుకు ఇవ్వరండి అని అడిగేసేదట. యిక చేతిలో ఒక పైసా లేకపోయినా ఏమాత్రం అధైర్య పడకుండా బాధపడకుండా నువ్వు ప్రయత్నించు ఏదో ఒక అవకాశం మంచిది వస్తుందిలే అని సపోర్ట్ చేసే వారట.

ఇక చలపతిరావు గారి భార్య ముగ్గురు పిల్లలు పుట్టాక మరణించారు. అప్పటికి ఆయన వయసు 27 సంవత్సరాలు దీంతో అందరూ రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా ఆయన పిల్లల కోసం చేసుకోలేదు. అదీ కాక ఆయన తన భార్యకు పెళ్ళైన మొదట్లోనే ఇంకో ఆడదాని వైపు చూడను, చెడు అలవాట్లకు పోను అని మాటిచ్చారట. ఇప్పటికీ ఆ మటకు కట్టుబడి ఉన్నానని చెప్తారు చలపతిరావు. ఆయన తన పిల్లల చదువు గురించి ఎక్కువగా ఆలోచించేవాడట. తనకుటుంబం లో అందరూ వ్యవసాయం చేసే వాళ్లే, ఎవరూ చదువుకోలేదు అందుకే ఆయన పిల్లలు మంచి చదువులు చదవాలి అని భావించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి వదిలేసి వారిని చదివించారట.
































