Senior Character Artist Sudha : తమిళనాడులో జన్మించినా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినా ఆ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించిన సుధ తెలుగులో చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో నటించారు. తన కెరీర్ కి సంబంధించిన ఆటుపోట్లతో పాటు ఎదురైన అవమానాలను కూడా ఆమె తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎన్టీఆర్ అలా చేస్తాడని అనుకోలేదు…
‘బాద్ షా’ సినిమా సమయంలో ఎన్టీఆర్ తో సుధ గారికి ఒక సాంగ్ బిట్ ఉంటుంది, అందులో నటించినపుడు జరిగిన సంఘటనలను తెలుపుతూ సుధ ఎన్టీఆర్ గురించి తెలిపారు. బాద్ షా లో ఎన్టీఆర్ డాన్స్ చేసే సీన్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో రాత్రి 2 గంటల సమయంలో జరుగగా పాటకు డాన్స్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన సుధ గారు మొదటి టేక్ లో బాగా చేసినా మరో టేక్ చేద్దామని చెప్పారట. ఎన్టీఆర్ మొదటి టేక్ బాగా చేసారు సరిపోతుందని చెప్పినా వినకుండా మరోసారి ప్రాక్టీస్ చేస్తుండగా కాలు బెణికిందట సుద గారికి.

అయితే కాలు బెణికే సరికి ఎన్టీఆర్ గారు వచ్చి కాలు పట్టుకుని స్ప్రే చేసి ఎలా ఉంది అంటూ చూడటం చాలా బాగా అనిపించిందంటూ సుధ గారు చెప్పారు. ఒక పెద్ద స్టార్ అలా చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంత అనుకువగా ఉంటాడు కాబట్టే అతను అంత పెద్ద స్టార్ అయ్యాడు అంటూ సుధ తెలిపారు. ఇక ఏడుపు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు వస్తాయంటూ తెలిపారు సుధ. తన తండ్రిని తలుచుకుంటే కన్నీళ్లు ఇట్టే వచ్చేస్తాయంటూ తెలిపారు.































