Senior Heroine Divya Vani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాలో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్శించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించినా తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్నిభాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

కాళ్ళు పట్టుకున్న వినలేదు…..
దివ్య వాణి కెరీర్ లో ఆమెచేసిన సినిమాలు చాలా తక్కువ. హీరోయిన్ గా చూసిన సక్సెస్ బాగున్నా సినిమాలను ఎక్కువగా చేయకుండా కెరీర్ బాగా పీక్స్ లో ఉన్నపుడే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. తనకు మంచి ఫేమ్ వచ్చింది ‘పెళ్లి పుస్తకం’ సినిమాతో అంటూ చెప్పారు దివ్య వాణి. ఆ సినిమా అవకాశం అనుకోకుండా వచ్చిందని ఇక ఆ సినిమాతో పాటు వచ్చిన మరో రెండు సినిమాలు కలిపి హ్యాట్రిక్ గా నిలిచాయి అంటూ చెప్పారు. ఇక ఆ సినిమాల తరువాత మంచి అవకాశాలు చేజరాయంటూ చెప్పారు.

బాపు గారు తీసిన ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో మొదట తానే హీరోయిన్ అనుకున్నా చివరికి కథ మారిపోయిందని, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా తీసుకోలేదంటూ చెప్పారు. కొందరి ఇగోస్ కి నేను బలయ్యానంటూ చెప్పారు. చేయమన్న ప్రతిదీ నేను చేయడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల వాళ్ళ మాట విననని తెలిసి కొంతమంది నన్ను సినిమా నుండి తప్పించారు. ఇక అలా ఆఫర్స్ పోయాక నేను ఇండస్ట్రీకి పెళ్లితో దూరమయ్యాను అంటూ చెప్పారు దివ్య వాణి.






























