Senior Heroine Divya Vani: బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో సత్యభామగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించినా తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్నిభాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం అలాగే సంపాదించిన ఆస్తుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే…
దివ్య వాణి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టాక ఒకేసారి మూడు హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే అందరికీ షాకిస్తూ చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలను తగ్గించిన దివ్య వాణి ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక కొడుకు కూతురు లతో హాయిగా ఉన్న దివ్య వాణి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఇక తన కుటుంబం, భర్త గురించి చెబుతూ తన భర్తకు కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయని చెప్పారు.

ఆయన వ్యాపారవేత్త, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసారు. అవన్నీ ఒట్టి అపద్ధాలే అంటూ తెల్చేశారు. డబ్బా చెప్పుకోవడం నాకు రాదు, ఆయనకు కాఫీ ఎస్టేట్ ఉంది ఉన్నంతలో బాగున్నాం అంతకు మించి వేల కోట్ల ఆస్తులు అవన్నీ అపద్దాలే. అలాంటివి సోషల్ మీడియాలో చూసినపుడు నాకు ఫోన్ చేసి నన్నే అడగండిరా నయనా, నాకు అన్ని ఆస్తులు లేవు అని నవ్వుకుంటాం అంటూ చెప్పారు.































