Senior heroine Geetha : మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అలనాటి అందాల తార గీత. తెలుగులో తగినన్ని సినిమాల్లో నటించలేక పోయినా మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంది. తమిళం లో మొదట రజనీకాంత్ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలు గా నటించిన గీత ఆ తరువాత మలయాళంలో చేసిన సినిమాలో ఇందిర అనే నక్సలైట్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆ ఒక్క తప్పు వల్లే టీవీ షో నుండి తప్పుకుంది…
తమిళం, మలయాళం మాత్రమే కాకుండా కన్నడ లో అందరు అగ్ర హీరోల సరసన నటించిన గీత అగ్ర హీరోయిన్ గా వెలిగింది. ఇక గీత సినిమాల్లో హీరోయిన్ గా చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ఇక బుల్లితెర మీద కూడా సందడి చేసింది. ‘బతుకు జట్కా బండి’ ప్రోగ్రామ్ కి జడ్జి గా వ్యవహారించింది. అయితే ఆ షో మంచి హిట్ అయి గీతకి మళ్ళీ మంచి పేరు వచ్చింది.

కానీ ఒక ఎపిసోడ్ లో గీత ఒక అమ్మాయిని బూతులు తిట్టడం వల్ల అందరి విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘పెళ్లి చేయండి దీనికి యు సన్ ఆఫ్ బిచ్’ అంటూ పరుష పదజాలం తో మాట్లాడటం వల్ల అందరూ తీవ్రంగా గీతను వ్యతిరేకించారు. ఇక చివరకు గీత ఆ షో నుండి తప్పుకుంది. అలా మంచి పేరు తెచ్చుకున్న షో నుండి గీత మాటల వల్ల విమర్శల పాలైంది.



























