Senior Heroine Ramya Krishna : మంత్రి రోజా ఇంటికి వెళ్లిన రమ్యకృష్ణ… పొలిటికల్ ఎంట్రీ పై జోరుగా చర్చ…!

0
170

Senior Heroine Ramya Krishna : రాజకీయాల్లో సినిమా గ్లామర్ మామూలే. పాలు నీళ్ల లాగా రాజకీయాలను సినిమా వాళ్ళను వేరు చేయలేము. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సినిమా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పని రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా కూడా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి సెకండ్ ఇన్నింగ్స్ లో టీవీ ఇండస్ట్రీలోకి వెళ్లి ప్రస్తుతం వైసీపీ పార్టీ నుండి పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా మరో హీరోయిన్ ఏపీ రాజకీయాల్లోకి రాబోతుందనే చర్చ వినపడుతోంది. ఆమె ఎవరో కాదు రమ్య కృష్ణ.

మినిస్టర్ రోజా ఇంటికి రమ్య కృష్ణ…

సినిమా హీరోయిన్లకు రాజకీయాలు కొత్త కాదు. ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ అపార్టీ కోసం ప్రాచారాలను కూడా చేస్తుంటారు. సీనియర్ నటులయిన జయసుధ, జయప్రదం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తాజాగా జయసుధ కూడా వైసీపీ కి మద్దతు ప్రకటించగా నేడు రమ్య కృష్ణ మంత్రి రోజా ఇంటికి వెళ్లడం పట్ల చాలా మంది ఆమె కూడా వైసీపీ లో చేరనుంది అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోడానికి తిరుపతి వెళ్లిన రమ్య కృష్ణ తన కొడుకుతో పాటు స్వామి దర్శనం చేసుకున్నారు.

ఆపైన మినిస్టర్ రోజా ఇంటికి వెళ్లి అక్కడ కాసేపు గడిపారు. కొడుకుతో పాటు వెళ్లిన రమ్య కృష్ణ రోజా భర్త డైరెక్టర్ సెల్వమని తో కూడా మంచి పరిచయం ఉండటంతో కాసేపు వారితో ముచ్చటించారు. ఇక ఆమెను పలకరించడానికి వచ్చిన జనాలతో ఫోటోలు దిగిన రమ్య కృష్ణ కు రోజా తమ ఇల్లంతా చూపించారు. ఇక చీర, సారె పెట్టి రమ్య కృష్ణ గారిని పంపారు రోజా. వారి మధ్య పాలిటిక్స్ గురించి ఎటువంటి చర్చ రాకపోయినా ప్రస్తుతం ఏపీ లో హాట్ టాపిక్ మాత్రం రమ్య కృష్ణ పొలిటికల్ ఎంట్రీ మీదనే.