Senior Journalist Bharadwaj : కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్థులు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. 1966 లో ‘చిలక గోరింకా’ సినిమాతో మొదటి సారి తెరమీద కనిపించినప్పటి నుండి ‘రాధే శ్యామ్’ సినిమా వరకు అభిమానులను అలరించారు. సినిమాలలో ఎక్కువగా గంభీరమైన పాత్రలలో నటించిన కృష్ణం రాజు నిజజీవితంలో కూడా ఆయన గంభీరంగా రాజసంగానే ఉండేవారట. అవకాశాలకోసం ప్రయత్నించే అప్పటినుండి ఇప్పటి వరకూ ఎప్పుడూ కూడా ఒకటే రకంగానే ఉండేవారు అని చెప్తుంటారు. కృష్ణంరాజు గురించి మరిన్ని విషయాలు జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చేప్పుకొచ్చారు.

అదే ఆయన నిజస్వరూపం…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమల రెబల్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన ఎక్కువగా మీడియా ముందు తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పేవారు అని.. ఒకరోజు తన పాఠశాలలో జరిగిన ఒక సంఘటనతో కృష్ణంరాజు గారిని వాళ్ళ నాన్నగారు బాగా కొట్టి, రాజసం, గంభీరం అనేది మనకు మనం చెప్పుకొనేది చూపించుకొనేది కాదు మన ప్రవర్తన వలన అవతలి వాళ్లకు అది తెలియాలి అని చెప్పారట. ఆ విషయాన్ని కృష్ణం రాజు గారు ఎక్కువగా పాటించేవారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆదుర్తి సుబ్బారావు గారు ‘తేనెమనసులు’ సినిమాలో సెకండ్ హీరో పాత్ర కోసం ఆడిషన్స్ ఉన్నాయని పేపర్ లో ప్రకటన ఇవ్వడంతో కృష్ణంరాజు గారు, కృష్ణ గారు వెళ్లి పోటీ పడటం జరిగింది. అయితే ఆ పాత్రకు కృష్ణ గారిని ఎంపిక చేసుకోవడంతో కృష్ణంరాజు గారు బాధపడకుండా సినిమాకు ఎంపిక చేయబడిన వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఇచ్చారట. ఎందుకు నువ్వు సెలెక్ట్ కాలేదు కదా మరి ఈ పార్టీ ఏంటి అని అడుగగా.. అపుడు వారి నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నారట. అది కృష్ణం రాజు గారి స్వభావం, ఎప్పుడూ ఆయన ఒకేరాకంగానే ఉంటారు అని ఆయన గురించి చెప్పారు.



























