Senior Journalist Bhardwaja : రాజకీయాల్లో ఎవరు ఎపుడు ఏ గూటికి చెరుతారో తెలియదు. చాలా రోజులుగా వైసీపీ లో ఉన్న ఆలీ కి ఈ మధ్యనే సీఎం జగన్ పిలిచి పార్టీలో క్రియాశీలకంగా ఉండేందుకు వీలుగా కొత్త బాధ్యతలను అప్పగించారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఆలీ అత్యంత సన్నిహితుడు అనే విషయం అందరికీ తెలుసు. దీంతో ఇప్పుడు జగన్ కావాలనే అలీకి పదవి ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతా అంటూ చేసిన కామెంట్స్ ను పరోక్షంగా ఎవరి గురించి అంటూ చర్చలు జరిగాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆలీతో సరదాగా షో కి పవన్ కళ్యాణ్ ను పిలుస్తారా అంటూ ప్రశ్న అలీ కి రావడం, ఖచ్చితంగా నేనే వెళ్లి పిలుస్త అంటూ ఆలీ అనడంతో ఇప్పుడు ఈ ఇష్యూ రాసవత్తరంగా మారింది. అయితే ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి సీనుర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

పవన్ తో అలీ కి ఉన్న బంధం అదే…
భరద్వాజ గారు మాట్లాడుతూ ఆలీ తనకంటూ ఒక గుర్తింపు సొంతంగా తెచ్చుకున్నారు ఎవరి మీద ఆధారపడి తెచ్చుకోలేదు. అయితే సినిమా ప్రయాణంలోనే ఆలీ పవన్ కళ్యాణ్ కలిశారు. ఒకరికి ఒకరు పరిచయం పెంచుకుని మనస్తత్వాలు నచ్చడం వల్ల స్నేహితులుగా మారారు. ఇద్దరి కాంబినేషన్ సినిమాల్లో హిట్ అవడం, వాళ్ళ స్నేహాన్ని మరింత పెంచింది అంతే తప్ప పవన్ వల్ల సినిమా ఫీల్డ్ లో కానీ వ్యక్తిగతంగా కానీ అలీ ఎదగలేదు. వాళ్ళ మధ్య స్నేహం పరిమితి ఎంత వరకు అన్నది వాళ్ళకే తెలియాలి. అయితే అలీ ఇంకో పార్టీలో చేరకూడదు అనేంత స్నేహం మాత్రం వారి మధ్య లేకపోవచ్చు. ఇక ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆయన వైఖరి నచ్చనప్పుడు కూడా ఇంతకాలం ఎపుడూ విమర్శించలేదు. చాలా రోజుల నుండి వైసీపీ లో ఉన్నా ఏనాడూ పవన్ ను ఆలీ విమర్శించలేదు.

పదవుల కోసం ఆలీ ఈ పని ఎపుడో చేసి ఉండవచ్చు కదా కానీ అలా చేయలేదు. ఇప్పుడు పదవి లభించినా కొత్తగా అలా విమర్శిస్తాడని అనుకోవడం లేదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఇక అలీ తో సరదాగా షో కి తానే స్వయంగా వెళ్లి పవన్ ను ఆహ్వానిస్తానంటూ అలీ అనడం బాగున్నా పవన్ ఇక్కడ డిఫెన్స్ లోకి నెట్టినట్లయింది అంటూ అభిప్రాయపడ్డారు. పవన్ వస్తే స్నేహం కోసం వచ్చారని భావించవచ్చు, రాకపోతే అలీ పిలిచినా పవన్ రాలేదు అనే విమర్శ ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక రావడం రాకపోవడం పవన్ సొంత నిర్ణయం అంటూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు.