Senior Journalist Bhardwaja : ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకూ ఆసియన్ పాటకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. అదీ కాక మన ఇండియన్ సినిమా అందున తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇది మరువక ముందే ఆస్కార్ కి కూడా నాటు నాటు పాట నామినేట్ అయిందనే విషయం తెలియడంతో మన ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఇక ఇప్పుడు సూపర్ క్రిటిక్స్ అవార్డు నామినేషన్ లిస్ట్ లో హాలీవుడ్ హీరోల సరసన నిలిచి మరోసారి మన ఇండియాకు ప్రైడ్ మూమెంట్ తీసుకొచ్చారు. అయితే ఈ అవార్డు ఎవరికి వస్తోందో తెలియకపోయినా రామ్ చరణ్ అమెరికా వెళ్లడం తారక్ ఇంకా వెళ్లకపోవడంతో రాంచరణ్ కి వచ్చిందంటూ వస్తున్న వార్తలను నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ వివరించారు.

రామ్ చరణ్ అమెరికాకి మరి తారక్…
భరద్వాజ గారు మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి అంతర్జాతీయ వేదిక మీద ఉంచాలని భావించి ఆందులో సక్సెస్ అయ్యాడని దీనివల్ల అతని పేరు ప్రఖ్యాతలు పెరగడమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది అంటూ అభిప్రాయాపడ్డారు. ఇక సినిమాకు మరోసారి అవార్డు రాబోతుంది అనే ఊహాగానాల నడుమ రామ్ చరణ్ అమెరికా వెళ్లడం జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడంతో, అవార్డు రామ్ చరణ్ కి వచ్చింది అంటూ వస్తున్న వార్తలను గురించి భరద్వాజ మాట్లాడారు.

రామ్ చరణ్ కి అవార్డు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ అవార్డు ఫంక్షన్స్ లో ప్రెజెంటేటర్ గాను అలాగే ఆ కార్యక్రమంలో ఇతర కేటగిరిలో అవార్డు గెలుచుకున్న వారికీ అవార్డు ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. ఇవి మాత్రమే కాకుండా అక్కడ అమెరికన్ షోస్ లో పాల్గొని నాటు నాటు సాంగ్ ని రామ్ చరణ్ ప్రమోట్ చేయబోతున్నట్లు సమాచారం ఉంది. అయితే ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి ఉండగా తారకరత్న మరణం ఆ తదనంతర పరిస్థితుల వల్ల వెళ్లలేక పోయాడు. అయితే ఆలస్యంగా అయినా వెళ్లొచ్చేమో తెలియదు. మార్చి రెండో వారం వరకూ అక్కడే ఉండి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు అనే మాట వినిపిస్తోంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.



























