Senior Journalist Bhardwaja : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఈ సినిమా తాజాగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలలో కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన విశ్లేషణ అందించారు.

శాకుంతల పాత్ర ద్వారా నేటి సమాజానికి ఏమీ చెప్పలేదు…
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడుతూ శాకుంతలం సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్నదే అయినా దానిని దర్శకుడి కోణం నుండి చూపించి నేటి సమాజ పోకడలను చూపించి ఉంటే బాగుందడేది. పాత సినిమాలను తీసేటప్పుడు మాయాబజార్ వంటి సినిమాల సమయంలో మూల కథ ఉంటూనే సమాజానికి ఉపయోగపడేలా ఒక సందేశం ఉండేది. ఈ శాకుంతలం సినిమాలో కూడా సందేశాన్ని నేటి సమాజానికి ఇచ్చేందుకు అనుగుణమైన పాత్రలు ఎన్నో ఉన్నా డైరెక్టర్ అటు వైపు వెళ్ళలేదు. సమంత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు చెప్పిన మాట శకుంతల ఇండియా మొదటి సింగల్ పేరెంట్ అని.

ఒక మహిళగా శకుంతల తన తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా భర్త వదిలేసినా ఆమె ఎలా జీవనం సాగించింది అన్న విషయాలు నేటి సమాజానికి ఇలాంటి విషయాల్లో ఒక మంచి విషయాన్ని చెప్పేందుకు ఆస్కారం ఉన్నా ఆ దిశగా డైరెక్టర్ కథను వాడుకోలేదు. కేవలం కథను చెప్పడానికే సినిమా చేసాడు కానీ అందులో ప్రయోగత్మకంగా సమాజానికి అద్దం పట్టే పాత్రలు కానీ సంభాషణలు కానీ లేవు. నిజానికి గుణశేఖర్ కు నాటక రంగంతో అనుభవం ఉన్న బుర్ర సాయి మాధవ్ లాంటి రైటర్ దొరికినా సరిగా ఉపపగించుకోలేదని అనిపిస్తుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయాపడ్డారు.



























