Featured

Senior Journalist Bhardwaja : చంద్రమోహన్, కే విశ్వనాథ్, బాలసుబ్రమణ్యం ముగ్గురూ అన్నదమ్ములే… కానీ వాళ్ళ మధ్య మనస్పర్తలు…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ఫిబ్రవరి 2న అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దిగ్గజ డైరెక్టర్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ఆయన తీసిన మొదటి సినిమా నుండే అవార్డులు, సత్కారాలు ఆయనకోసం క్యూ కట్టాయి. ఇక ఆయన తీసిన ఎన్నో చిత్రాల్లో భారతీయ సంస్కృతి అలాగే కళలను ముందు తరాల వారికి అందించారు. ప్రతి సినిమాలోనూ ఆయన చెప్పాలనుకున్న కథతో మిళితంగా సమాజానికి ఏదో ఒక సందేశం ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన విశ్వనాథ్ గారికి నటుడు చంద్రమోహన్ అలాగే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం బంధువులవుతారు. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

అన్నదమ్ములైనా ఇండస్ట్రీకి వచ్చే వరకు తెలియదు…

విశ్వనాథ్ గారికి నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆసక్తి, ఇష్టం పెద్దగా లేకపోయినా తండ్రి ఆల్రెడీ వాహిని స్టూడియోలో పనిచేస్తూ ఉండటం వలన ఆయన మాట కాదనలేక సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా చేరారట. అయితే ఏ పని అయినా నిబద్ధతతో చేసే విశ్వనాథ్ గారు అదుర్తి సుబ్బారావు గారి కంట్లో పడటం అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావడం అనతి కాలంలో డైరెక్టర్ గా ‘ఆత్మ గౌరవం’ సినిమాను నాగేశ్వరావు గారితో తీయడం జరిగిపోయాయి. ఇక విశ్వనాథ్ గారి తండ్రికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మొదటి భార్య చెల్లెలు కొడుకు చంద్రమోహన్ అవడంతో వారిద్దరూ సోదరులు అవుతారు.

ఇక చంద్ర మోహన్ గారి బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం గారి అన్న పెళ్లి చేసుకోవడం వల్ల వారిద్దరూ కూడా బంధువులయ్యారు. అయితే ముగ్గురికీ తాము బంధువులు అనే విషయం ఇండస్ట్రీలో వీరు స్థిరపడ్డాకే తెలిసింది. వేర్వేరు చోట్ల కుటుంబాలు స్థిరపడటం వల్ల వారు బంధువులనే విషయం తెలియదట. ఇక ప్రతి ఇంట్లోనూ అభిప్రాయబేధాలు మామూలే అలానే వీరి ముగ్గురికీ కూడా అప్పుడప్పుడు అభిప్రాయబేధాలు వచ్చినా ముగ్గురూ బాగా కలిసి ఉండేవారు. చంద్ర మోహన్, విశ్వనాథ్ గారు చెన్నైలో పక్కపక్కన ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. అలా వీరు ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలోకి తెలియకుండా వచ్చిన అన్నదమ్ములు, ముగ్గురూ ఇండస్ట్రీని ఏలారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago