Senior Journalist Bhardwaja : సినిమా కథ ఎంపిక సినిమాకు కావాల్సిన ఆర్టిస్టుల ఎంపిక ఇవన్నీ ఒకెత్తయితే సినిమా షూటింగ్ సమయానికి ముంగించడం అనుకున్న బడ్జెట్ లో సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవ్వడం ఇక ఇన్ని కష్టాలను దాట్టుకుని ముందుకు పోతే సినిమా థియేటర్లలో విడుదల చేయడం అనేది మరో పెద్ద విషయం. 40 ఏళ్లుగా ఒక సినిమా విడుదలకు నోచుకోక ఒక నిర్మాత సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని తన ఆస్తులను పోగొట్టుకున్నా చివరికి ఆ సినిమాను 40 ఏళ్ళ తరువాత విడుదల చేసారు . ఆ సినిమానే నాగేశ్వరావు, జయసుధ నటించిన ప్రతి బింబాలు. నలభై ఏళ్ళ క్రితం నాటి ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అవ్వడంతో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ చెప్పారు.
ఈనాటికీ సరిపోయే ఆధునిక కథనే సినిమాగా…
ప్రతిబింబాలు సినిమాను ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేసారు. మొదట రాఘవేంద్ర రావు గారి తండ్రి కే ఎస్ మధుసూదన్ రావు గారు కథ ఎంపిక చేసుకుంటే ఆత్రేయ గారి మాటలతో సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఇక సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి కే ఎస్ మధుసూదన్ రావు గారు మధ్యలో ఆపేయడంతో సినిమాను సింగితం శ్రీనివాసరావు గారి చేత డైరెక్ట్ చేయించారు. సినిమాలో ఏఎన్ఆర్ కి జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించారు. జయసుధ మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఏఎన్ఆర్ ప్రేమించిన అమ్మాయి మరణించిందని భావించి తాగుడుకి బానిసగా మారి జీవితంలో నిరాశభావంతో ఉన్న సమయంలో జయసుధ ఆయన జీవితలోకి వచ్చి అయనను మారుస్తుంది.
ఆమె ప్రేమించిన వ్యక్తికి గతంలో దూరం అవ్వడం వల్ల ఆమె నాగేశ్వరావు గారిని మార్చే బాధ్యత తీసుకుంటుంది. సినిమాలో మనకు చెప్పే సందేశం ప్రేమించిన వ్యక్తి మనకు ఏ రకంగా దూరమైనా వారి కోసం మన జీవితం నాశనం చేసుకునే హక్కు మనకులేదు అంటూ సాగే ఈ కథ నేటి తరాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అంటూ సినిమా చాలా చక్కగా ఉంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. అక్కినేని కుటుంబ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ గారితో కొంచెం ప్రమోషన్స్ కల్పించుంటే సినిమా కొంతమంది ఆడియన్స్ కి రీచ్ అయింది.
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…