Senior journalist Bhardwaja : తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90 దశకపు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఇప్పుడు వీళ్లంతా సీనియర్ హీరోస్ అయిపోయినా కూడా ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలను చేస్తున్నారు. అలా ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరు ఓ వైపు, నటసింహ బాలయ్య ఓ వైపు పోటీ పడ్డారు. సంక్రాంతి పండుగ వేల వీరిద్దరూ ఫాన్స్ కి పండగ చేయించారు వాళ్ళ సినిమాలతో. నిజానికి ఈ సినిమాలు రెండూ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్, కథ రొటీన్ దే అయినా హీరోల ఇమేజ్ తో సినిమాను నెట్టుకొచ్చారు ఇద్దరు హీరోలు. ఇక ఈ సినిమాలు సగటు ప్రేక్షకుడికి అంతగా నచ్చలేదు అనే మాటలు వినిపిస్తున్న నేపధ్యంలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఇద్దరు పెద్ద హీరోలు ఎంచుకుంటున్న కథల గురించి విశ్లేషించారు.

అందుకే అలాంటి సినిమాలను చేస్తున్నారు…
ప్రయోగాలు చేయడానికి మన అగ్రహీరోలు సిద్ధంగా లేరని ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ప్రయోగాలు చెయడం లేదని భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. చిరంజీవి సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రయోగాలు చేసినా ఫలితం బాగలేదు అందుకే ఆయన రొటీన్ ఫార్ములా వాడి కమర్షియల్ ఎంటర్టైనర్ ను తీశారు హిట్ అయింది. ఇక బాలకృష్ణ మొదటి నుండి ఫ్యాక్షన్ సినిమాలతో హిట్ కొట్టారు. అఖండ ఒక ప్రయోగత్మక చిత్రమే అయినా అందులోనూ బాలకృష్ణ తాలుకు మాస్ యాక్షన్ ఉంటుంది.

అందువల్ల కొత్తగా అనిపించింది అంతే. ఇక ఇప్పుడు వచ్చిన వీర సింహా రెడ్డి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి హిట్ కొట్టింది. చిరంజీవి, బాలయ్య ఇద్దరి సినిమాల్లో రొటీన్ స్టోరీనే ఉన్నా కానీ సినిమా మాత్రం హిట్ అవడానికి కారణం అభిమానులు రొటీన్ కథ అయినా మాస్ ఎలిమెంట్స్ కోసం చూడటమే అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. అందువల్లే చిరంజీవి, బాలకృష్ణ హిట్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను ఎన్నుకుంటున్నారు ప్రయోగాలను పక్కన పెట్టి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.































