Senior journalist Bhardwaja : నెల్లూరుకి చెందిన కేఎస్ఆర్ దాస్ గారు మొదట థియేటర్లో బుకింగ్ క్లర్క్ గా జీవితం మొదలు పెట్టి ఆ తరువాత ఎస్ భావనారాయణ గారి ప్రోత్సహంతో మద్రాస్ కి వెళ్లి మొదట ఆయన వద్దే ఎన్టీఆర్ గారి సినిమా ‘బండ రాముడు’ కి ఫ్లోర్ క్లీనర్ గా పనిచేసారు. అలా కింద స్థాయి నుండి పైకి వచ్చిన ఆయన బుకింగ్ క్లర్క్ గా ఉన్నపుడే ఒక్క అవకాశం ఇస్తే హిట్టు సినిమాలు నూరు తీయగలను అని చెప్పేవారట. చెప్పినట్లుగానే అన్ని సినిమాలను ఆయన తీయడం అందులోనూ యాక్షన్ క్రైమ్ సినిమాలకు ఇండియా లోనే నెంబర్ అనిపించుకున్నారు. ఒక్క కృష్ణ గారితోనే దాదాపు 30 సినిమాలను దాస్ గారు తీశారు. అందులోనూ ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఇండియన్ సినిమాల్లోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచి అనేక భాషలలోకి డబ్ అయింది. ఇక ఆయన ఎన్టీఆర్ తో తీసిన చిత్రం మాత్రం విడుదల కాకముందు ఫ్యాన్స్ కు అనుమానలు కలిగించాయి. ఆ విశేషలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్…
ఎన్నో హిట్ సినిమాలను తీసిన దాస్ గారు ఎన్టీఆర్ తో మాత్రం చాలా ఏళ్లకు సినిమా అవకాశం అందుకున్నారు. డెబ్భైయ్యో దశకంలో దాస్ గారు కృష్ణతో కాకుండా ఎన్టీఆర్ తో సినిమా తీయడం ఎన్టీఆర్ తో ఎక్కువగా క్రైమ్ సినిమాలను తీసిన ఎస్డి లాల్ గారితో కృష్ణ గారు సినిమా తీయడం జరిగింది. ఎన్టీఆర్ తో అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా డాన్ ను తెలుగులో రీమేక్ చేసారు. ‘యుగంధర్’ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా సత్యంను కాదని ఇళయరాజును పెట్టుకోవడంతో అభిమానులు ఇందులో ఏదో కుట్ర ఉంది, కావాలనే ఎన్టీఆర్ సినిమాకు పేరు లేని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకుంటున్నారు అని అనుమానించారు.

దాస్ గారికి కూడా సత్యంను పెట్టుకోవాలని ఉన్నా ప్రొడ్యూసర్ పీతాంబరం గారి అబ్బీ వాసు ఒత్తిడి వల్ల ఇళయరాజా వైపు మొగ్గుచుపారు. అతను రీ రికార్డింగ్ మ్యూజిక్ బాగా ఇస్తాడు ఆలోచించండి అని చెప్పి ఒప్పించాడు. ఇక సినిమా ఎలా వస్తుందో అన్న అనుమానాలకు తెరపడి విడుదల అయిన తరువాత సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలోని నేపధ్య సంగీతం ఎంత హిట్టో పాటలన్నీ కూడా అంతే హిట్ అయ్యాయి.































