Senior Journalist Bhardwaja : ప్రేక్షకుడి సినిమా రుచి మారిపోయింది. అగ్ర హీరోనా లేక చిన్న హీరోనా అని పక్కన పెట్టి కథ చెప్పిన విధానం నచ్చితే సినిమా చూడటానికి మొగ్గుచూపుతున్నారు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమా రొటీన్ గా ఉంటే చూడటానికి ఆసక్తి చూపడజం లేదు. దీంతో ఇప్పుడు డైరెక్టర్స్ మరియు పెద్ద హీరోలు కూడా తలలు పట్టుకుంటున్నారు. సినిమా ఎలా తీస్తే ప్రేక్షకుడు ఒప్పుకుంటాడు అనే మీమాంసలో పడిపోయారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో జనాలను థియేటర్లకు రప్పించే దమ్మున్న సబ్జెక్టు ఎంచుకోవాలనే ఆలోచన మూవీ మేకర్స్ కి వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా కమిట్ అయ్యేరు ముందు హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలానే ఇప్పుడు మహేష్ కూడా త్రివిక్రమ్ కి ఒక విషయంలో క్లారిటీ ఇచ్చి షాకిచ్చాడు.

బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోతే సినిమా చేయను…
హీరోలు సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ చేతిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే రాజమౌళి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇందులో త్రివిక్రమ్ సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అందరూ భావించినా అది జరిగేలా కనిపించడం లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ కు పెట్టిన రూల్ అలాంటిది మరి. ఆ మధ్య ఒకసారి చిరంజీవి ఇపుడున్న డైరెక్టర్ల మీద ఒక విమర్శ చేసారు. అదే స్క్రిప్ట్ ముందే రాసి మా చేతికి ఇస్తే ప్రిపేర్ అయి వస్తాం, షూటింగ్ లో ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటే డైరెక్టర్ చూసుకుంటే సరిపోతుంది అని. అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ షూటింగ్ సెట్స్ లో అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసి ఇస్తున్నారు.

ఇక ఇప్పుడు ఇదే విషయంలో మీద మహేష్ కూడా త్రివిక్రమ్ కు రూల్ పెట్టాడట. సినిమా స్క్రిప్ట్ అంతా బౌండెడ్ ముందే ప్రిపేర్ చేయమని. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ హీరోలు తమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రేక్షకుడు చూడడని అర్థమైపోయింది. ఓటీటీ పుణ్యమా అని అన్ని భాషల సినిమాలను చూస్తున్న నేటి జనం కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం అగ్రహీరోలు అయినా సరే చిన్న హీరోలైనా సరే సగటు ప్రేక్షకుడికి భయపడుతున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.































