Senior Journalist Bhardwaja : సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఆయన దేవుడిని నమ్ముతారు. అయితే ఒకానొక సమయంలో ఆయన క్షుద్ర పూజలు చేస్తారంటూ, స్మశానలో పూజలు చేయడం రాత్రి పూట చీర కట్టుకుని పడుకోవడం వంటివి చేస్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ వట్టి అపవాదులు, కేవలం ఆయన పేరును పాడు చేయడానికి ఆనాటి ప్రతిపక్షాలు చేసిన కుట్ర. నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు ఇంకా చాలా మందికి తెలియవు అంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. నిజమైన ఎన్టీఆర్ తెలియాలంటే కుర్థళం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి ప్రస్తుతం మౌన స్వామి అని పిలిచే ఆయన ఒకసారి ఎన్టీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం గురించి చెప్పి కొత్త ఎన్టీఆర్ ను లోకానికి పరిచయం చేసారు అంటూ భరద్వాజ గారు వివరించారు.

క్షుద్రపూజలను ఎన్టీఆర్ నమ్మడా…
ఇక ఎన్టీఆర్ గారిలో ఒక ద్రావిడ సిద్ధాంతపు ఆలోచనలు ఎక్కువ, ఆయనను ఆ వైపుగా ప్రభావితం చేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి గారు. ఆ సిద్ధాంతపు ప్రభావం ఆయన సినిమాల్లోను అలాగే రాజకీయాల్లోకి వచ్చాక పాలన లోనూ కనిపిస్తుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గారికి సాహిత్యం మీద పట్టు బాగుంది, పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసు, అయితే ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటూ గట్టిగా వాటిని నమ్మేవారు. కానీ బయటి ప్రపంచానికి ఎన్టీఆర్ గారి విజ్ఞానం తెలియక సినిమాలు చేసే ఇతనికి రాజకీయం ఏమి తెలుసు అనుకునేవారు కానీ మొదటి సారి సీఎం అయ్యాక ఉగాది వేడుకలను నిర్వహించిన సమయంలో జరిగిన సంఘటన స్వయాన ప్రసాదరాయ కులపతి వివరించారు.

ఎన్టీఆర్ గారు బ్రాహ్మణ వ్యతిరేకి, కమ్మ బ్రహ్మాణ ఉద్యమంలో భాగంగా కొంత పౌరోహిత్యం బ్రాహ్మణులు కానివారు చేసేవారు. అలా ఎన్టీఆర్ గారు ఒకసారి తన స్నేహితుడి కుమారుడికి పౌరోహిత్యం చేసి పెళ్లి చేసారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అధికారి ఒక శ్లోకంలో ‘ గో బ్రాహ్మణ’ అన్న లైన్స్ ను తొలగించి చదవండి అని పండితులకు సూచించగా ఎన్టీఆర్ గారు శ్లోకం విన్నప్పుడు ఆ పదాలు కనిపించక మళ్ళీ మొత్తం శ్లోకం ఆయనే స్వయంగా చెప్పి ఎందుకు ఇలా చేసారో తెలియదు బ్రాహ్మణ అంటే కులం కాదు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన శూధ్రుడైనా బ్రాహ్మణుడే అంటూ శంకర పద్యం ను ఉదాహరించి దాదాపు రెండు గంటల పాటు భారతీయ ఋషితత్వం గురించి మాట్లాడారట. ఆయన ఆలోచనలు ఎంత స్పష్టమైనవో ఈ సంఘటన చెబుతుందంటూ భరద్వాజ గారు వివరించారు. దైవత్వాన్ని అంగీకరిస్తారు కానీ మూఢనమ్మకాలను కాదు, ఎన్టీఆర్ గారి ఆలోచనలు తెలిసిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది అంటూ చెప్పారు.
































