Senior Journalist Imandhi Ramarao : అలనాటి తారలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం అందరికి ఆసక్తి. అలాంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పలు ఇంటర్వ్యూ లలో చెబుతుంటారు. అలా తాజాగా ఏఎన్ఆర్, సావిత్రి కలిసి మందు తాగుతారనే విషయాన్ని జమున గారు పలు ఇంటర్వ్యూ లలో చెప్పిన సంగతులను జమున గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య వైరం ఉండేదంటూ పలు ఆసక్తికర విషయాలను ఇమంది గారు పంచుకున్నారు.

సావిత్రి, ఏఎన్ఆర్ ఇద్దరు మందు తాగేవాళ్ళు….
సావిత్రి మందు తాగుతుందనే విషయం మహానటి సినిమా ద్వారా అందరికి తెలిసిన అంతకు ముందే జమున గారు పలు ఇంటర్వ్యూల్లో సావిత్రి గారి మందు అలవాటు గురించి బాహటంగానే చెప్పేసారు. ఇమంది గారు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఏఎన్ఆర్, సావిత్రి, జమున ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటించినపుడు సావిత్రి, ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి మందు తాగేవారని మందు తాగుతూ నన్ను ఏడిపించేవారని జమున చెప్పేవారంటు ఇమంది పంచుకున్నారు. జమునకు నాగేశ్వరావు గారికి సరిపడదని చెప్పారు.

జమున గారు అహంభావి అంటూ నాగేశ్వరావు భావించేవారు. అలాగే నాగేశ్వరావు గారు అమ్మాయిలను గోకడం వంటివి చేస్తారంటు జమున భావించేవారని ఇమంది తెలిపారు. అందుకే వారిద్దరు ఎపుడు సఖ్యతగా ఉండేవారు కాదు కేవలం సినిమాల వరకే కలిసి నటించేవారు కానీ బయట పెద్దగా మాట్లాడేవారు కాదు అంటూ ఇమంది గారు తెలిపారు.