Senior journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరణికలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. వయసుమల్లిన పాత్రలో కనిపించి రిస్క్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఆయన క్రమశిక్షణ ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చిందని భావిస్తారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఆహారపు అలవాట్ల గురించి ఆయనను దగ్గర నుండి చూసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి… మాంసాహార ప్రియుడు…
ఎన్టీఆర్ గారు మొదటి నుండి క్రమశిక్షణ తో జీవించారు. షూటింగ్ ఎన్నింటికైనా కరెక్ట్ టైంకి అక్కడ ఉండేవారు. ఇతరులు లేట్ వచ్చినా దండించేవారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఇమంది గారు మాట్లాడుతూ ఆయన ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అనగా రెండున్నర, మూడు గంటల ప్రాంతంలో లేచి మొదట్లో వ్యాయామలు చేసేవారు. అయితే కొన్నేళలకు వయసు కొంచెం పెరిగాక వాహిని స్టూడియో నుండి వచ్చే పహిల్వాన్ తో మసాజ్ చేయించుకుని ఆ తరువాత స్నానము చేసి నిర్మాతలతో దర్శకులతో కొత్త కథల గురించి చర్చించేవారట. ఒక లంక చుట్ట కాల్చడం బాగా అలవాటు ఉండేదట రామారావు గారికి. ఇక వారితో చర్చల్లో ఉన్నపుడే బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీలు, ఇడియాప్పం లాంటివి తినేవారు అంటూ చెప్పారు. ఇడియాప్పం అంటే చాలా ఇష్టం అంటూ ఇమంది గారు చెప్పారు.

పక్షి మాంసం అంటే చాలా ఇష్టం, ఉదయం అల్పాహారంలో పక్షి మాంసం ఖచ్చితంగా తినేవారు. ఇక డ్రై ఫ్రూట్స్ పాలతో కూడిన జ్యూస్ ఒక లీటర్ తాగి ఇక ఆపై షూటింగ్ కి ఆరోజు కావాల్సిన పాత్రకు తగ్గ మేకప్ అలాగే డ్రెస్సింగ్ చూసుకుని బయలుదేరాక ఇక ఆయనను చూడటానికి వచ్చిన వారిని కలిసి మాట్లాడిన తరువాత బసవతారకం గారు పసుపు నీళ్లు దిగదీసిన తరువాత భూత రాజు అనే వ్యక్తి దిష్టి తీసాక అప్పుడు ఆయన షూటింగ్ వెళ్ళేవారు. పౌరానిక పాత్రలు వేసినపుడు మాత్రం మాంసం ముట్టేవారు కాదు అంటూ ఎంతో నిష్టగా ఉండేవారు అంటూ చెప్పారు ఇమంది గారు.































