Senior Journalist Imandhi Ramarao : రాజనాలను పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన వాణిశ్రీ…డబ్బులకోసం వెళితే ఎం అన్నదంటే…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

0
93

Senior Journalist Imandhi Ramarao : నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ . తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది . అయితే సినిమాల్లో చిన్న చిన్న వేషాలేసుకుంటూ మొదట్లో ఆమె చాలా ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నారు. అలా ఆమెను అవమానించినవారే సహాయం కోసం వచ్చినపుడు ఆమె ఎలా ప్రవర్తించారు వంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

రాజనాలను లోపలికి పిలిచి….

సినిమాల్లో ఇంకా చిన్న చిన్న వేషాలు వేసుకునే టైం లో వాణిశ్రీ గారిని రాజనాల గారు అవమానించారు అంటూ ఇమంది రామారావు ఆ సంగతులను తెలిపారు. అప్పట్లో రాజనాల గారు స్టార్ గా వెలుగుతున్న సమయంలో ఆయనకున్న కోపం సెట్స్ లో బాయ్స్ మీద చూపించేవరని అప్పట్లో ఎవరి కుర్చీ వాళ్ళు తెచ్చుకోగా రాజనాల గారికి కుర్చీ లేకపోతే వాణిశ్రీ గారు ఆటపట్టించడానికి మీకు కుర్చీ లేదే ఇప్పుడెలా అంటూ మాట్లాడితే ఆయన కోపంతో వేరేవాళ్ళ కుర్చీని కాలితో తన్ని అందులో కూర్చున్నారట. అది కుర్చీని తన్నినట్లుగా లేదు నన్ను అవమానించినట్లే వుంది అని వాణిశ్రీ గారు బాధపడటం అది పెద్ద గొడవ కావడంతో ఆయన క్షమాపణ మాత్రం చెప్పలేదట. ఒక చిన్న ఆర్టిస్ట్ కు నేను సారీ చెప్పడం ఏమిటి అని చెప్పలేదట. ఇక తరువాతి కాలంలో హీరోయిన్ గా వాణిశ్రీ మంచి స్టార్ అవ్వడం రాజనాల గారికి అవకాశలు తగ్గి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆమెను సహాయం అడగటానికి ఇంటికి వెళ్లగా డబ్బు అడగలేక పోయాడట.

గతంలో అవమానించిన దానికి క్షమాపణ చెప్పగా లోపలోకి పిలిచి అవన్నీ ఇపుడెందుకని వాణిశ్రీ చెప్పి భోజనం పెట్టించిందట. ఆపైన ఇంటికి కారులో డ్రాప్ చెయమని డ్రైవర్ కి చెప్పగా ఆయన డబ్బు అడగటానికి ఇబ్బంది పడ్డారట. అయితే ఇంటి దగ్గర దిగబెట్టి డ్రైవర్ ఒక కవర్ లో 25 వేల రూపాయల డబ్బులుచ్చి మేడం ఇమ్మన్నారు అని చెప్పి వెళ్ళాడట. అలా అవమానించిన ఆమె మళ్ళీ సహాయం చేసారని ఆనాడు రాజనాల బాగా బాధపడ్డారంటు ఇమంది రామరావు తెలిపారు.